నాగబంధం టీజర్ అప్డేట్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న వీడియో

by I. Sairam |

‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukundhuvate) మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన నభా నటేష్(Nabha Natesh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

నాగబంధం టీజర్ అప్డేట్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్: ‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukundhuvate) మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన నభా నటేష్(Nabha Natesh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ‘అదుగో’(Adugo) అనే సినిమాలో నటించింది. కానీ ఈ చిత్రం అంతగా విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్(Ram Pothineni) నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’(Ismart Shankar) మూవీతో ఫుల్ ఫామ్‌లోకి వచ్చింది.

దీంతో ఈ చిన్నదానికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘డిస్కో రాజా’(Disco Raja), ‘సోలో బ్రతుకే సో బెటర్’(Solo Brathuke So Better), డార్లింగ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం నిఖిల్(Nikhil) సరసన ‘స్వయంభు’(Swayambhu) మూవీలో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అందచందాలతో కుర్రకారుకు అందాల విందును వడ్డిస్తుంది. నభా నటేష్ నటిస్తున్న ప్రాజెక్టుల్లో నాగబంధం ఒకటి. విరాట్‌కర్ణ హీరోగా నటిస్తున్న మైథలాజికల్‌ యాక్షన్‌ డ్రామాకు అభిషేక్‌ నామా దర్శకత్వం వహిస్తున్నాడు.

ఐశ్వర్య మీనన్‌, జగపతిబాబు, జయప్రకాష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని కిషోర్‌ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ వేసవిలో పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేస్తామని మేకర్స్‌ తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ అన్నీ మూవీపై అంచనాలు పెంచగా..తాజాగా టీజర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇందులో భాగంగా నాగబంధం మూవీ టీజర్ మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 15న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో రిలీజ్ చేసిన వీడియో గూస్ బంప్స్ తెప్పించింది. ఓ ఋషి యాగం చేస్తుండగా.. అతనిపై నుంచి నాగు పాములు పోతున్నాయి. అంతేకాకుండా దేవాలయ ద్వారం చుట్టూ నాగు పాములు చుట్టూ ముట్టి బంధించాయి. కాగా ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.

Next Story