- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nagababu: నాగబాబుకు ఏమైంది..మరి ఇంత సన్నగా ?
చిరంజీవి 2009లో పెట్టిన ప్రజా రాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టిన నాగబాబు,

దిశ, వెబ్ డెస్క్: మెగా బ్రదర్ నాగబాబు ( Nagaba bu Konidela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi) ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాగబాబు, దాదాపు 100కు పైగా సినిమాలు చేశారు. ఇందులో నాగబాబు, సహాయ నటుడిగా అలాగే విలన్ పాత్రలు చేసినవి కూడా ఉన్నాయి. అలాగే తండ్రి, మామయ్య ఇలాంటి పాత్రలు చేస్తూ కెరీర్ ముందుకు సాగిస్తున్నారు. అదే సమయంలో జనసేన పార్టీలో ( Janasena Party) కీలక పాత్ర పోషిస్తున్నారు నాగబాబు. మొదట చిరంజీవి 2009లో పెట్టిన ప్రజా రాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టిన నాగబాబు, నర్సాపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి, ఓడిపోయారు.
ప్రస్తుతం జనసేన పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు నాగబాబు. అంతేకాదు ఇటీవల కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శాసన సభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా ఏకగ్రీవంగా విజయం సాధించి, శాసన మండలి సభ్యుడిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు నాగబాబు. అయితే అలాంటి మెగా బ్రదర్ నాగబాబు కొత్త అవతారంలో దర్శనం ఇచ్చారు. చాలా బక్క చిక్కి కనిపించారు నాగబాబు. తన ఫ్యామిలీతో కలిసి iffi గోవా 2025 ( Iffi Goa 2025)ఈవెంట్ లో పాల్గొన్నారు మెగా బ్రదర్ నాగబాబు.
ఈ సందర్భంగా నాగబాబు కాస్త అనారోగ్యంగా కనిపించినట్లు వీడియో వైరల్ గా మారింది. గతంలో లాగా ఫిట్ గా ఆయన కనిపించడం లేదు. చాలా వరకు బరువు తగ్గిన నాగబాబు.. కాస్త స్లిమ్ గా కూడా కనిపించారు. దీంతో మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఆయనకు ఏదైనా అనారోగ్యం సోకిందా? లేక స్లిమ్ గా కావడానికి డైట్ పాటిస్తున్నాడా ? అంటూ టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. కాగా iffi గోవా 2025 ఈవెంట్ లో నాగబాబుతో పాటు మెగా డాటర్ నిహారిక, ఆయన సతీమణీ కూడా పాల్గొన్నారు. లింక్






