నిహారిక కు రెండో పెళ్లి... మెగా బ్రదర్ కీలక ప్రకటన!

by velandi.Saikiran |

మెగా బ్రదర్, జనసేన సీనియర్ నాయకులు నాగబాబు ( Naga Babu) కీలక ప్రకటన చేశారు. తన కూతురు నిహారిక రెండో పెళ్లిపై..

నిహారిక కు రెండో పెళ్లి... మెగా బ్రదర్ కీలక ప్రకటన!
X

దిశ, వెబ్ డెస్క్ : మెగా బ్రదర్, జనసేన సీనియర్ నాయకులు నాగబాబు ( Naga Babu) కీలక ప్రకటన చేశారు. తన కూతురు నిహారిక రెండో పెళ్లిపై.. సంచలన ప్రకటన చేశారు. తన కూతురు రెండో పెళ్లి చేసుకుంటుందని... దానికి కాస్త సమయం ఉందని వెల్లడించారు. మెగా డాటర్ నిహారిక (niharika konidela ) గత రెండు సంవత్సరాల కిందటే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. జొన్నలగడ్డ చైతన్యను (Chaitanya Jonnalagadda).. పెళ్లి చేసుకుంది నిహారిక.

వీరిద్దరి వివాహం రాజస్థాన్ లోని ఉదయపూర్ లో డిసెంబర్ 9, 2020లో జరిగింది. అయితే మూడు సంవత్సరాల పాటు కాపురం చేసిన ఈ జంట 2023లో విడిపోయింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇక అప్పటినుంచి నిహారిక సింగిల్ గానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో నిహారిక రెండో పెళ్లి పై నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నిహారిక, చైతన్య ను ప్రాపర్ గా జడ్జ్ చేయలేకపోయామని వివరించారు.

వాళ్ళిద్దరు పరస్పర అంగీకారంతో విడిపోయారని వెల్లడించారు. ఇప్పుడిప్పుడే నిహారిక అందులో నుంచి తేరుకుంటుందని.. నాగబాబు స్పష్టం చేశారు. కానీ ఏదో ఒక రోజు నిహారిక వేరే.. అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందని వివరించారు. వారి విషయాలలో ఇన్వాల్వ్ కావాలని అనుకోవడం లేదని చెప్పారు. పిల్లలకు నచ్చినట్లుగా జీవించాలని కోరుకుంటాను అంటూ ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Next Story