మ్యాజిక్ చేసేందుకు వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ కాంబో.. ప్రకటనతో సర్‌ప్రైజ్ ఇచ్చిన నాగవంశీ

by I. Sairam |

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) రీసెంట్‌గా ‘తెలుసు కదా’(Telusu Kadaa) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

మ్యాజిక్ చేసేందుకు వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ కాంబో.. ప్రకటనతో సర్‌ప్రైజ్ ఇచ్చిన నాగవంశీ
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) రీసెంట్‌గా ‘తెలుసు కదా’(Telusu Kadaa) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రజెంట్ అతను నటిస్తున్న సినిమా ‘బడాస్’(Badass). దీనికి రవికాంత్ పెరెపు(Ravikanth Perepu) దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రొడ్యూసర్ నాగవంశీ(Naga Vamshi) ఫ్యాన్స్‌కు మరో కిక్కిచ్చే న్యూస్ తన ఎక్స్ వేదికగా వెల్లడించారు.

ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘బడాస్ రాకముందే.. కొంచెం సరదాగా గడుపుదాం. మరో క్రేజీ ఎంటర్‌టైనర్‌తో తిరిగి వస్తున్నాను.. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెం-40తో ఓ సినిమా తెరకెక్కనుంది’ అని రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. అయితే పోస్టర్‌ను గమనించినట్లయితే ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ చిత్రానికి స్వరూప్ ఆర్ఎస్‌జే(Swaroop RSJ) దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా బడాస్ మూవీ కంటే ముందే రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత నాగవంశీ వెల్లడించారు. కాగా స్టార్ బాయ్ చేస్తున్న రెండు సినిమాలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కనుండంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొన్నది.

Link

Next Story