నాగ వంశీ నెక్ట్స్ లెవల్ ప్లాన్.. సిద్ధుతో ఓటీటీ ప్రాజెక్ట్ స్టార్ట్

by Pulgam srinivas |

ప్రముఖ నిర్మాత నాగ వంశీ, సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నెట్‌ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

నాగ వంశీ నెక్ట్స్ లెవల్ ప్లాన్.. సిద్ధుతో ఓటీటీ ప్రాజెక్ట్ స్టార్ట్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ క్రేజీ నిర్మాత నాగ వంశీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతున్నారు. ఇలాంటి సమయంలో మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా ఓటీటీ ప్రాజెక్టుల వైపు కూడా ఈయన దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో చేతులు కలిపినట్లు సమాచారం. సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ ఓ వెబ్ సిరీస్‌ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌కు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

నాగ వంశీ వంటి స్టార్ ప్రొడ్యూసర్ ఓటీటీ వైపు అడుగులు వేయడం ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్‌కు దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయనను అనుసరించి మరికొందరు ప్రముఖ నిర్మాతలు కూడా వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే ఇప్పటికే నాగ వంశీ–సిద్ధు జొన్నలగడ్డ కాంబినేషన్‌లో వచ్చిన మ్యాడ్ మరియు మ్యాడ్ స్క్వేర్ చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఈ నేపథ్యంలో వీరి కాంబోలో రూపొందబోయే వెబ్ సిరీస్‌పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Next Story