Sobhita: ఫైనల్లీ అంటూ నాగ చైతన్యపై భార్య శోభితా ధూళిపాళ్ల ఇంట్రెస్టింగ్ స్టోరీ..?

by Kodari Anjali |

అక్కినేని హీరో నాగచైతన్య(Naga Chaitanya) అండ్ భార్య శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipalla) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Sobhita: ఫైనల్లీ అంటూ నాగ చైతన్యపై భార్య శోభితా ధూళిపాళ్ల ఇంట్రెస్టింగ్ స్టోరీ..?
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని హీరో నాగచైతన్య(Naga Chaitanya) అండ్ భార్య శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipalla) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. వీరిద్దరు ఇరుకుంటుంబ సభ్యుల నడుమ అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది (2024) లో ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. అయితే పెళ్లికి ముందే ఈ కపుల్ ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియా టాక్.

అటు శోభితాకు.. ఇటు నాగచైతన్యకు ఇద్దరికి రెండో వివాహమని తెలుస్తోంది. వీరి పెళ్లై రెండు నెలలు గడుస్తోంది. ఈ క్రమంలో నాగచైతన్య అండ్ శోభితా ధూళిపాళ్ల సోషల్ మీడియాలో తమ అన్యోన్య దాంపత్యం గురించి వరుస పోస్టులు పెడుతూ అక్కినేని అభిమానులను ఖుషి చేస్తున్నారు. ప్రస్తుతం శోభితా కూడా అక్కినేని ఇంట్లో కోడలిగా తన బాధ్యతలు స్వీకరిస్తూ ఉత్తమ కోడలిగా పేరు సంపాదించుకుంది.

రీసెంట్‌గా భర్త నాగచైతన్య నటిస్తోన్న తండేల్(Tandel) మూవీ గురించి సోషల్ మీడియా వేదికన ఓ పోస్ట్ పెట్టింది. తండేల్ మూవీ టీమ్‌కు శుభాకాంక్షలు తెలపడంతో పాటు.. ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా చాలా హ్యీపీగా అండ్ ఎగ్జైట్‌గా ఉందని పోస్ట్‌లో రాసుకొచ్చింది. అలాగే ఈ మూవీ చిత్రీకరణ జరిగినన్నీ డేస్ చైతూ చాలా పాజిటివ్ అండ్ ఫోకస్ మొత్తం మూవీపైనే పెట్టినట్లు భర్తను కొనియాడింది. అలాగే ప్రేక్షకులందరితో పాటు శోభితా కూడా థియేటర్‌లో తండేల్ చిత్రాన్ని వీక్షాస్తానని చెప్పుకొచ్చింది.

ఈ అసాధారణమైన ప్రేమ కథను అందరూ చూసే వరకు నేను వెయిట్ చేయలేను అని వెల్లడించింది. అంతేకాకుండా ఫైనల్లీ నాగ చైతన్య గడ్డం షేవ్ చేస్తాడని.. కాగా మొదటి సారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ..’’ అంటూ శోభితా ధూళిపాళ్ల పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఈ క్యాప్షన్‌కు తండేల్ మూవీకి సంబంధించిన చైతూ ఫొటో కూడా పంచుకుంది. ప్రస్తుతం అక్కినేని కోడలు ఇంట్రెస్టింగ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ వీక్షించిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.

Next Story