#NC24 : దర్శకుడిపై నాగ చైతన్య సీరియస్..

by Sujitha Rachapalli |

‘విరూపాక్ష’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు కార్తీక్ దండు.. ప్రస్తుతం యువసామ్రాట్ నాగార్జునతో కలిసి #NC24 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే దసరా సందర్భంగా ఆయుధ పూజ అంటూ ఓ వెపన్‌కు సంబంధించిన ఫొటో

#NC24 : దర్శకుడిపై నాగ చైతన్య సీరియస్..
X

దిశ, వెబ్ డెస్క్ : ‘విరూపాక్ష’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు కార్తీక్ దండు.. ప్రస్తుతం యువసామ్రాట్ నాగార్జునతో కలిసి #NC24 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే దసరా సందర్భంగా ఆయుధ పూజ అంటూ ఓ వెపన్‌కు సంబంధించిన ఫొటో రిలీజ్ చేసి సినిమాపై క్యురియాసిటీ పెంచేసింది టీమ్. పదిహేడేళ్ల చైతు సినీ జర్నీలో ఈ మూవీ మైలు రాయిగా నిలుస్తుందని.. ఇండియన్ సినిమా చరిత్రలో కల్లోలం సృష్టిస్తుందని చెప్పింది. ఇక ఈ చిత్రం కోసం పగలు రాత్రి లేకుండా డైరెక్టర్ కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. బిజీ షెడ్యూల్స్ కారణంగా కనీసం తిండి కూడా సరిగ్గా తినట్లేదని.. హెల్త్ కరాబ్ చేసుకుంటున్నాడని.. చైతు సీరియస్ అయినట్లు టాక్. అందుకే ముందు ఆరోగ్యం చూసుకోమని.. తర్వాత పని చేయడం మంచిదని అక్కినేని వారసుడు సూచించాడని ఫిల్మ్ నగర్ టాక్.

Next Story