Nagachaitanya-Sobhitha: గొప్ప మనసు చాటుకున్న కొత్త జంట.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

అక్కినేని హీరో నాగచైతన్య(Naga Chaitanya), శోభిత(Shobitha Dhulipala) ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ కొత్త జంట గొప్ప మనసు చాటుకున్నారు.

Nagachaitanya-Sobhitha: గొప్ప మనసు చాటుకున్న కొత్త జంట.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: అక్కినేని హీరో నాగచైతన్య(Naga Chaitanya), శోభిత(Shobitha Dhulipala) ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ కొత్త జంట గొప్ప మనసు చాటుకున్నారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న పిల్లలకు సాయం చేసి వార్తల్లో నిలిచారు. హైదరాబాద్‌లో ఉండే సెయింట్ జ్యూడ్ ఇండియా చైల్డ్ కేర్ సెంటర్‌కు వెళ్లారు. అక్కడ క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారులను నాగచైతన్య, శోభి ప్రేమగా పలకరించి వారితో కబుర్లు చెప్పారు. వాళ్లతో సెల్ఫీలు తీసుకోవడంతో పాటు డ్యాన్స్‌లు కూడా వేశారు. అలాగే వారికి నచ్చిన బహుమతులు అందజేసి చిన్నారుల ఆనందానికి కారణం అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక ఈ పిక్స్ చూసిన నెటిజన్లు వావ్ గ్రేట్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, నాగచైతన్య, శోభిత కొద్దికాలం పాటు డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది పెద్దలను ఒప్పించి అన్నపూర్ణ స్టూడియోలో పెళ్లి చేసుకున్నారు. ఇక వివాహం తర్వాత శోభిత క్రేజ్ మారిపోయింది. ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. ఇన్నాళ్లు బోల్డ్‌గా నటించిన ఆమె పెళ్లి తర్వాత నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులకు దగ్గరగా ఉంటుంది.

కానీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇస్తుందా లేదా అనేది మాత్రం వెల్లడించడం లేదు. కుటుంబ బాధ్యత తీసుకుని ఇంట్లోనే ఉంటుంది. అయితే నాగచైతన్య విషయానికొస్తే.. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. అయితే ‘తండేల్’ (Thandel)ఫిబ్రవరి 7న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబట్టింది. కానీ విడుదలైన రోజు ఆన్‌లైన్‌లోకి రావడంతో హిట్ కాదని అంతా భావించారు. కానీ, మత్స్యకారులు జీవితాన్ని చూపించిన చందూ మొండేటి లవ్ స్టోరీతో అందరినీ మంత్రముగ్దులను చేశారు.

Next Story