- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పొలిటికల్ థ్రిల్లర్‌తో రాబోతున్న నాగచైతన్య.. పోస్ట్‌తో హైప్ పెంచిన డైరెక్టర్!
అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) లవ్ స్టోరీ, బంగారు రాజు వంటి సినిమాలతో హిట్స్ సాధించారు.

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) లవ్ స్టోరీ(Love Story), బంగారు రాజు వంటి సినిమాలతో హిట్స్ సాధించారు. కానీ ఆ తర్వాత చేసిన చిత్రాలు మాత్రం అంతగా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాయి. ఇక ఇటీవల నాగచైతన్య నటించిన ‘తండేల్’(Thandel) ఘన విజయం సాధించింది. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించగా.. మత్య్సకారునిగా నటించి ఎట్టకేలకు చాలా ఏళ్ల తర్వాత తన ఖాతాలో హిట్ వేసుకున్నారు. అదే ఫామ్‌తో ఇప్పుడు ‘NC-24’ మూవీ చేస్తున్నారు. మైథాలజికల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాను కార్తీక్ దండు తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, నాగచైతన్య ఓ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలుపుతూ డైరెక్టర్ దేవ కట్టా(deva katta) ట్వీట్ చేశారు. ఆయన ఇంతకు ముందు చైతు ‘ఆటో నగర్ సూర్య’ను కూడా తెరకెక్కించారు.
ఇక ఇప్పుడు ఓ సిరీస్‌ను తెరకెక్కిస్తుండటంతో సంతోషంగా ఉన్నట్లు వెల్లడించారు. ‘‘కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఈ సిరీస్‌తో వస్తున్నాను. ఈ సంవత్సరం చివరి త్రైమాసికంలో ప్రసారం కానున్న చివరి మిశ్రమంలో ఉన్న ‘MAYASABHA’ సీజన్ 1ని 400 నిమిషాల పాటు ఆనందిస్తున్నాము. అలాగే నాకు అత్యంత ఇష్టమైన నటుడితో డైరెక్ట్ చేయడానికి స్క్రిప్ట్ చేస్తున్నాను’’ అనే క్యాప్షన్ జత చేశారు. అయితే ఆయన నాగచైతన్యతో చేస్తున్నట్లు హింట్ ఇచ్చేశారని అంతా కామెంట్లు చేస్తున్నారు. ఈ సిరీస్‌లో ఆది పినిశెట్టి కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాక్. ఇక చైతు పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. గత ఏడాది శోభిత దూళిపాళను పెళ్లి చేసుకున్నాడు. సినిమాలకు గ్యాప్ దొరికినప్పుడల్లా భార్యతో వెకేషన్‌కు వెళ్తున్నారు.






