- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాక్సాఫీసు వద్ద దుళ్లకొట్టేసారు.. 9 రోజుల్లో ‘తండేల్’ ఎన్ని కోట్లు రాబట్టిందంటే? (ట్వీట్)
అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), చందూ మొండేటి(Chandoo Mondeti) కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘తండేల్’.

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), చందూ మొండేటి(Chandoo Mondeti) కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘తండేల్’. ఇందులో చైతు సరసన సాయి పల్లవి(Sai Pallavi) హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్(Geetha Arts) బ్యానర్‌పై అల్లు అరవింద్, బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 7న థియేటర్స్‌లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. అయితే శ్రీకాకుళం మత్స్యకారుల జీవితం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు ‘తండేల్’లో చూపించిడంతో ప్రేక్షకుల ఫిదా అయిపోయారు. అలాగే సాయిపల్లవి, నాగచైతన్య కెమిస్ట్రీకి అంతా మంత్రముగ్దులయ్యారనడంలో అతిశయోక్తి లేదు.
ఈ మూవీ థియేటర్స్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతుంది. తాజాగా, ‘తండేల్’ సరికొత్త మైలు రాయిని చేరుకున్నట్లు తెలుపుతూ మూవీ మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 9 రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ రాబట్టి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ పోస్ట్‌కు ‘‘బాక్స్ ఆఫీస్ దుళ్లకొట్టేసారు.. థియేటర్స్‌కి జాతర తెచ్చేసారు’’ అనే క్యాప్షన్ జత చేసి పోస్టర్లను షేర్ చేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న అక్కినేని అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
కాగా, ‘తండేల్’ చిత్రం హిట్ సాధించినప్పటికీ విడుదలైన రోజే ఆన్‌లైన్‌లో ప్రింట్ రావడం గమనార్హం. అంతేకాకుండా ఆర్టీసీ బస్సులోనూ ప్రదర్శించడంతో చిత్రబృందం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పైరసీకి పాల్పడుతున్న వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని నిర్మాతలు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక ఈ విషయంపై అధికారులను సంప్రదించండంతో.. పైరసీ చేసిన కేటుగాళ్లను పట్టుకున్నారు. ఇక ‘తండేల్’ సమస్య తీరడంతో థియేటర్స్‌లో దూసుకుపోతూ భారీ కలెక్షన్లు రాబడుతోంది.






