పెళ్లి తర్వాత 'తండేల్' ఈవెంట్‌కి హాజరయిన నాగ చైతన్య, శోభిత.. ఆకట్టుకుంటున్న ఫొటోలు

by Kavitha |   ( Updated:2025-02-12 12:11:00.0  )
పెళ్లి తర్వాత తండేల్ ఈవెంట్‌కి హాజరయిన నాగ చైతన్య, శోభిత.. ఆకట్టుకుంటున్న ఫొటోలు
X

దిశ, సినిమా: అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) ‘జోష్’(Josh) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ‘ఏమాయ చేసావే’(Ye Maya Chesave) మూవీతో మంచి విజయం సాధించాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన స్టార్ హీరోయిన్ సమంత(Samantha)తో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నాడు. కానీ పట్టుమని ఫోర్ ఇయర్స్ కలిసి ఉండలేక విడాకులు(Divorce) తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి సమంత మయోసైటీస్(Myositis) అనే వ్యాధి బారిన పడి సినిమాలకు దూరం అయింది.

అంతే కాకుండా ప్రజెంట్ మరో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటుంది. కానీ నాగ చైతన్య డివోర్స్ తర్వాత స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Sobhitha Dhulipala)తో డేటింగ్‌లో ఉంటూ 2024 డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్‌గా పెళ్లి కూడా చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ జంట మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే..అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన తాజా సినిమా ‘తండేల్’(Thandel).

చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను.. అల్లు అరవింద్(Allu aravind) సమర్పణలో బన్నీ వాసు(Bunny Vasu) నిర్మించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ ఆకట్టుకుని చిత్రంపై భారీ అంచనాలు పెంచగా.. సాంగ్స్ మాత్రం సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అలా విడుదలకు ముందే క్యూరియాసిటీని పెంచిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న భారీ అంచనాల నడుమ థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక ఫస్ట్ షో నుంచే మంచి టాక్ తెచ్చుకుంటూ దూసుకుపోతుంది.

ఇందులో నాగ చైతన్య, సాయి పల్లవి యాక్టింగ్‌కి ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తున్నారు ఆడియన్స్. అలాగే దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad) తన మ్యూజిక్‌తో అదరగొట్టేశాడు. అంతే కాకుండా కలెక్షన్ల విషయంలోనూ సునామీ సృష్టిస్తోంది. అయితే నిన్న హైదరాబాద్ ట్రిడెంట్ హోటల్‌లో ‘తండేల్ బ్లాక్ బస్టర్ లవ్ సునామీ’ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా డైరెక్టర్ రాఘవేంద్ర రావు(Raghavendra rao) పాల్గొన్నారు. అలాగే నాగార్జున(Nagarjuna) కూడా హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్‌కి నాగ చైతన్య, శోభిత కూడా కలిసి వచ్చారు. మ్యారేజ్ తర్వా ఫస్ట్ టై ఈ సినిమా ఈవెంట్‌కి కలిసి రావడంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతూ ఆ ఫొటోస్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ప్రజెంట్ ఆ ఫొటోలు నెట్టింట ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Next Story