- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nag Ashwin: అతను గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం.. కల్కి 2 పై నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ‘కల్కి 2898 ఏడీ’(Kalki 2898 AD) ఎంతగా హిట్ అయిందో మనందరికీ తెలిసిందే.

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ‘కల్కి 2898 ఏడీ’(Kalki 2898 AD) ఎంతగా హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ మూవీని నాగ్ అశ్విన్(Nag Ashwin) తెరకెక్కించాడు. అయితే వైజయంతి ప్రొడక్షన్స్ బ్యానర్ పై అశ్వినీ దత్(Ashwini Dutt) భారీ బడ్జేట్‌తో తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), కమల్ హాసన్(Kamal Haasan), దీపిక పదుకొణె(Deepika Padukone), దిశా పటానీ(Disha Patani), దుల్కర్ సల్మాన్(Dulquer Salman), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur), విజయ్ దేవరకొండ(vijay Devarakonda) వంటి ప్రముఖులు కీలక పాత్ర పోషించారు.
అయితే ఈ మూవీకి సీక్వెల్ ఉందన్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే నిర్మాత అశ్వినీ దత్ కీలక వ్యాఖ్యలు కూడా చేశాడు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతదా అని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. “ప్రస్తుతం ఈ సినిమా తాలూకా స్క్రిప్ట్ పూర్తయింది. ఇక ప్రభాస్ నుంచి షూటింగ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆలస్యం.
ఒకసారి కల్కి 2 రాకకు ప్రభాస్.. సినిమా కోసం సిద్ధం అయితే, అన్ని సెట్టయితే మూవీ పూర్తి చేయడానికి ఎంతో టైం తీసుకోదు. అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ చిత్రాన్ని 2026 ఎండింగ్‌లో అలా విడుదల చేసే ఆలోచనలో ఉన్నాం. ఆల్రెడీ ప్రభాస్ లేని సీన్స్, షూటింగ్ సెట్టింగ్, ఇతర వర్క్ చాలానే పూర్తి చేశారు. సో మూవీ అనుకున్న సమయానికి వచ్చే చాన్స్‌లు ఉన్నాయి” అని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.






