‘నడికట్టు’ ట్రైలర్ విడుదల

by Sujitha Rachapalli |

ధనుష్ దేవర పొలి, భానుచందర్, శ్వేత, సత్యప్రియ ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం ‘నడికట్టు’. సహస్ర శ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై మంచూరి సోమశేఖర్ రావు నిర్మిస్తున్న చిత్రానికి ఎస్.వి.దిలీప్ కుమార్ దర్శకులు. కాగా తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను నటుడు రాజా రవీంద్ర చేతుల మీదుగా రిలీజ్ చేశారు

‘నడికట్టు’ ట్రైలర్ విడుదల
X

దిశ, సినిమా : ధనుష్ దేవర పొలి, భానుచందర్, శ్వేత, సత్యప్రియ ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం ‘నడికట్టు’. సహస్ర శ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై మంచూరి సోమశేఖర్ రావు నిర్మిస్తున్న చిత్రానికి ఎస్.వి.దిలీప్ కుమార్ దర్శకులు. కాగా తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను నటుడు రాజా రవీంద్ర చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. ‘ప్రేక్షకులకు మంచి సినిమాను అందిస్తున్న యూనిట్‌కు శుభాకాంక్షలు. సినిమా మంచి విజయాన్ని అందుకోవాలి’ అని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీఎఫ్ సీసీ ప్రతాని రామకృష్ణ గౌడ్ ..'నడికట్టు' ట్రైలర్ బాగుందని ప్రశంసించారు. నిర్మాత మంచూరి సోమశేఖర్ రావు మాట్లాడుతూ.. సినీరంగంపై ఉన్న ఆసక్తి, అభిమానం తనను ‘సహస్ర శ్రీ క్రియేషన్స్’ బ్యానర్‌ను స్థాపించడానికి ప్రేరేపించాయని తెలిపాడు. మంచి కథలు, మంచి భావాలు కలిగిన సినిమాలు ప్రేక్షకులకు అందించాలన్న కోరికతో తన సినీ ప్రయాణం మొదలైందన్నాడు. మా తొలి చిత్రం ‘నడికట్టు’ ఎంతో ప్రేమ, శ్రద్ధతో రూపొందించిన ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అని చెప్పాడు. ‘నడికట్టు’ ప్రాజెక్టు మా అందరి కల అని.. ఆ కలకు తామంతా కలిసి జీవం పోశామని..అందరికీ నచ్చేలా తీర్చిదిద్దామని తెలిపాడు. ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. భానుచందర్ సర్ ఈరోజు తమ మధ్య ఉండటమే గర్వకారణమని చెప్పాడు నిర్మాత.

Next Story