Nabha Natesh: యాక్సిడెంట్ తర్వాత వాటిని ఎంతో ఎంజాయ్ చేస్తున్న.. యంగ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Chukka Sudharani |   (  Updated:2025-02-18 13:40:41  IST  )

యంగ్ బ్యూటీ నభా నటేష్ (Nabha Natesh).. తన నటన, అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Nabha Natesh: యాక్సిడెంట్ తర్వాత వాటిని ఎంతో ఎంజాయ్ చేస్తున్న.. యంగ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ నభా నటేష్ (Nabha Natesh).. తన నటన, అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే గతంలో జరిగిన యాక్సిడెంట్ కారణంగా కొంత కాలం ఇండస్ట్రీకి దూరం అయినా ఈ బ్యూటీ.. చాలా గ్యాప్ తర్వాత ‘డార్లింగ్’(Darling) మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి మార్కులే సొంతం చేసుకుంది. దీంతో ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా మూవీస్ చేస్తోంది. నిఖిల్(Nikhil) హీరోగా నటిస్తున్న స్వయంభు (Swayambhu)మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే రీసెంట్‌గా ‘నాగబంధం’ (Nagabagndham) అనే పాన్ ఇండియా చిత్రాన్ని స్టార్ట్ చేసింది. ఇక సినిమాలతో పాటు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అందాలతో కుర్రాళ్లుకు పిచ్చెక్కిస్తూ వాళ్లను మంత్ర ముగ్ధులను చేస్తుంది. అలాగే జిమ్ (Gym) చేస్తున్న ఫొటోలను కూడా అభిమానులతో పంచుకుంటోంది నభా.

ఇదిలా ఉంటే.. తనకు యాక్సిడెంట్ (Accident) జరిగిన తర్వాత జిమ్ చెయ్యడాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. ‘మూడేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో భుజం గాయపడి కొన్ని సర్జరీలు (Surgeries) చేశారు. ఆ టైమ్‌లో ఫిట్‌నెస్‌ను తిరిగి పొందడానికి చాలా శ్రమించాను. అలాగే ఇప్పుడు నటిస్తున్న పాన్ ఇండియా చిత్రాల కోసం కూడా ఎంతో స్ట్రెంగ్త్‌ను బిల్డ్ చేసుకుంటున్న. దాని కోసం వర్కవుట్స్ చేయడాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చింది.

Next Story