- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pushpa 2: పుష్ప-2 పై అలాంటి ప్రచారం చేస్తున్న వారికి మైత్రి మూవీ మేకర్స్ హెచ్చరిక
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun) హీరోగా నటించిన పుష్ప-2 ( Pushpa 2) డిసెంబర్ 5 న రిలీజ్ అయింది.

దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun) హీరోగా నటించిన పుష్ప-2 ( Pushpa 2) డిసెంబర్ 5 న రిలీజ్ అయింది. ఈ సినిమాలో లేని డైలాగులను జత చేసి కావాలని ప్రచారం చేస్తున్న వారికి ట్విట్టర్ వేదికగా మైత్రి మూవీ మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. “ఊహాజనితమైన, సొంత క్రియేటీవిటితో పుట్టించిన కొన్ని డైలాగులు పుష్ప-2 చిత్రంలోనివి అంటూ కొంత మంది కావాలని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు. వాంటెడ్ గా కొంత మంది సినిమాపై నెగటివ్ ప్రచారం కోసం కావాలని ఇలాంటివి పోస్ట్ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి పోస్టులు పోస్ట్ చెయ్యటం మానుకోకపోతే అలాంటి వారిపై చట్ట పరమైన యాక్షన్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం.” అని మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది.
ఇంకోవైపు, పుష్ప 2 మూవీ హిట్ కొట్టిన సందర్భంగా “మేము అల్లు అర్జున్ ఫ్యాన్స్ ” అంటూ టీవీ, యూట్యూబ్‌లకు ఎవరిష్టమొచ్చినట్లు వాళ్ళు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో ఆల్ ఇండియా అల్లు అర్జున్ ఫ్యాన్స్, వెల్ఫేర్ అసోసియేషన్ స్పందించింది. అలాంటి వారితో తమకి ఎలాంటి సంబందం లేదని స్పష్టం చేసింది.
“అల్లు అర్జున్ అభిమానులమని చెప్పుకునే ఫ్యాన్స్ టీవీ, యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇస్తే అది వారి వ్యక్తిగతం. వారు చెప్పిన దానికి అధికారికంగా మా మద్దతు ఉండదు. ఏ ఇతర హీరోల మీద లేదా రాజకీయంగా ఏ నాయకుల మీదనైనా కొందరు అల్లు అర్జున్ ఫాన్స్ అని చెబుతూ చేసే కామెంట్లకు మేము సపోర్ట్ చేయబోం. అలాంటి ఫ్యాన్స్ ను దూరంగా ఉంచుతాం” అని ఆల్ ఇండియా అల్లు అర్జున్ ఫ్యాన్స్, వెల్ఫేర్ అసోసియేషన్ ట్విట్టర్ లో వెల్లడించింది.
Read More...
రేవతి కుటుంబాన్ని కలిసి సాయం చేస్తా.. తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ స్పందన (వీడియో)






