గతం కంటే ఇప్పుడు నా ఆలోచనలు పూర్తిగా మారాయి.. ఆ భ్రమ నుంచి బయటకు వచ్చా: సమంత

by Mallepaka Hamsa |

అందరినీ దాటి ముందుకు వెళ్లాలి, ఒకరిని ఓడించాలి అనే పోటీ తత్వంతో ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే.. ఇక్కడ ఎలాంటి రేసు లేదు అని.

గతం కంటే ఇప్పుడు నా ఆలోచనలు పూర్తిగా మారాయి.. ఆ భ్రమ నుంచి బయటకు వచ్చా: సమంత
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చాలా గ్యాప్ తర్వాత ‘మా ఇంటి బంగారం’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. నందిని రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని సమంత తన సొంత బ్యానర్‌ ట్రాలాలా పిక్చర్స్‌పై భర్త రాజ్ నిడిమోరుతో కలిసి నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 19న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈనేపథ్యంలో ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ అయిపోయిన సమంత వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా, సమంత తన సినీ ప్రయాణం, కెరీర్‌లో ఎదుర్కొన్న ఒడిదొడుకులపై షేర్ చేసిన కొన్ని విషయాలు నెట్టింట వైరల్‌గా మారాయి. గతం కంటే ఇప్పుడు సినిమాను చూసే తన కోణం పూర్తిగా మారిపోయిందని ఆమె పంచుకున్నారు. ‘‘గతంలో ఇండస్ట్రీలో నేను ఒక రేసులో పరిగెడుతున్నట్లు భావించేదాన్ని.

అందరినీ దాటి ముందుకు వెళ్లాలి, ఒకరిని ఓడించాలి అనే పోటీ తత్వంతో ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే.. ఇక్కడ ఎలాంటి రేసు లేదు, అది ఒక భ్రమ మాత్రమే. దానికి ముగింపు రేఖ అంటూ ఏదీ ఉండదు. అందుకే ఇప్పుడు నేను నా పనిని ఎంతో స్వచ్ఛందంగా చూస్తున్నాను’’ అని సమంత పేర్కొన్నారు. తన కెరీర్‌లో వచ్చిన ఇటీవలి బ్రేక్ సమయంలో చాలా విషయాలను మార్చుకోవాలని డిసైడ్ అయ్యానని సమంత తెలిపారు. ఇక తన సొంత బ్యానర్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ గురించి మాట్లాడుతూ.. ‘‘లేడీ ఓరియెంటెడ్ కథలపై నాకు నమ్మకం ఉంది, వారికి మరిన్ని అవకాశాలు రావాలి అని నేను నమ్మినప్పుడు.. నేనే నా సొంత డబ్బు పెట్టి అలాంటి చిత్రాలను సపోర్ట్ చేయాలని ఈ అడుగు వేశాను’’ అని సమంత చెప్పుకొచ్చారు.

Next Story