రామాయణం మూవీలో నా పాత్ర అలా ఉంటుంది.. స్టార్ యాక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by I. Sairam |

బాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌ల‌లో ఒక‌టి ‘రామాయణం’(Ramayanam).

రామాయణం మూవీలో నా పాత్ర అలా ఉంటుంది.. స్టార్ యాక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌ల‌లో ఒక‌టి ‘రామాయణం’(Ramayanam). బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి(Nithish Tiwari) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా(Namit Malhothra)తో కలిసి రాకింగ్ స్టార్ అత్యంత భారీ బడ్జేట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో రాముడిగా రణబీర్ కపూర్(Ranbeer Kapoor), సీతగా సాయిపల్లవి(Sai pallavi), రావణుడిగా యష్, హ‌నుమంతుడిగా సన్నీ డియోల్, ల‌క్ష్మ‌ణుడిగా ర‌వి దూబే త‌దిత‌రులు న‌టించ‌బోతున్నారు. అయితే ఈ సినిమాలో త‌న పాత్ర‌కు సంబంధించి తాజాగా ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నాడు న‌టుడు స‌న్నీడియోల్.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సన్నీ డియోల్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో హనుమంతుడి పాత్ర పోషిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోల్ చాలా స‌రదాగా అల్ల‌రిగా ఉండ‌డంతో పాటు ఉత్స‌హాంగా ఉంటుంది. నా పాత్ర‌కు సంబంధించి త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభంకానుంది. ఇలాంటి పాత్ర‌లు చాలా సవాలుతో కూడుకున్న‌వి కాబట్టి అందులో పూర్తిగా లీన‌మై న‌టించాలి. ఇక ప్రేక్షకులకు ఒక గొప్ప సినిమాటిక్ అనుభూతిని పంచడానికి చిత్రబృందం నిరంతరం శ్రమిస్తోంది.

హాలీవుడ్ సినిమాల స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రామాయణం లాంటి మహాకావ్యాన్ని ఎన్నిసార్లు తెరకెక్కించినా కొత్తగానే ఉంటుంది. అయితే ఈ సినిమాతో ప్రపంచమంతా రామాయణం గొప్పతనాన్ని మరోసారి తెలుసుకుంటుంది’ అని సన్నీ డియోల్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story