- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా నెక్స్ట్ సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ అవుతుంది.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
టాలీవుడ్‌లో ప్రస్తుతం హిట్ డైరెక్టర్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు అనిల్ రావిపూడి(Anil Ravipudi).

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో ప్రస్తుతం హిట్ డైరెక్టర్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు అనిల్ రావిపూడి(Anil Ravipudi). ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ దర్శకుడి పేరు మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, చిరంజీవి కెరీర్‌లో మరో సరికొత్త రికార్డును సృష్టించింది. స్ట్రాంగ్ కలెక్షన్స్‌తో థియేటర్లలో ఇంకా విజయవంతంగా రన్ అవుతోంది. ఈ క్రమంలో అనిల్ రావిపూడి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘నా 10వ సినిమాకి ఐడియా క్రాక్ చేశాను. టైటిల్ కూడా ఫిక్స్ చేశాము.
చాలా విచిత్రమైన టైటిల్ అది. హీరో ఎవరు అనేది ఫిక్స్ అవ్వలేదు కానీ.. టైటిల్ అనౌన్స్ మెంట్ నుండే వీడు మళ్ళీ మొదలెట్టాడురా బాబు అని అందరూ తిట్టుకోవడం ఖాయం. అయితే ఆ సినిమా కూడా సంక్రాంతికి వస్తుంది’అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.






