- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా అమ్మ ముందే ఆ పని చేశా.. అలా చేయడం చాలా బాధగా అనిపించింది, తట్టుకోలేకపోయాను.. యంగ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ హీరో నితిన్(Nithin) ప్రస్తుతం నటించిన తాజా సినిమా ‘తమ్ముడు’(Thammudu).

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో నితిన్(Nithin) ప్రస్తుతం నటించిన తాజా సినిమా ‘తమ్ముడు’(Thammudu). ఇక దీనికి శ్రీరామ్ వేణు(Sriram Venu) దర్శకత్వం వహించగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్‌రాజు(Dil Raju) నిర్మించారు. సప్తమి గౌడ(Sapthami Gowda) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో లయ(Laya), స్వశిక(Swashika), వర్ష బొల్లమ్మ(Varsha Bollamma), సౌరభ్ సచ్‌దేవా(Sourabh Sachdeva) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే తాజాగా శుక్రవారం (జూలై 4)న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ క్రమంలో యంగ్ బ్యూటీ స్వశిక చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రమోషన్లలో భాగంగా తాజాగా నితిన్, సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, స్వశిక విజయ్, సీనియర్ హీరోయిన్ లయ కలిసి లంచ్ చేస్తూ మూవీ గురించి చాలా విషయాలను పంచుకున్నారు. ఇందులో భాగంగా స్వశిక మాట్లాడుతూ.. ‘సినిమాకు ముందు నాకు అసలు సిగరెట్ తాగడం అలవాటు లేదు. కానీ డైరెక్టర్ మూవీలో నా పాత్ర సిగరెట్ తాగాల్సి ఉంటుందని చెప్పడంతో ప్రాక్టీస్ చేశాను. అలా పాత్ర కోసం రోజూ మా అమ్మ ముందే ఇంట్లో సిగరెట్ తాగడం ప్రాక్టీస్ చేశాను. మొదట్లో చాలా ఇబ్బందిగా, బాధగా అనిపించింది.
ఆమె ముందే అలా చేయడం నాకు నచ్చలేదు. కానీ నా పాత్రకు ఉన్న ఇంపార్టెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని తాగాను. అది సినిమాలో బాగా వచ్చింది. డైరెక్టర్ గారు తాగమన్నారని మా అమ్మకు చెప్పడంతో ఆమెకు ఇష్టం లేకపోయినా ఒప్పుకుంది. చివరకు సినిమాలో అది వర్కౌట్ అయింది. మూవీలో నా రోల్‌ను చూసి నాకే షాకింగ్‌గా అనిపించింది’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






