- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాకు పదేళ్ల వయసులోనే మా అమ్మ చనిపోయింది.. నాన్న పట్టించుకోలేదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న నటి కామెంట్స్
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’(seethamma Vakitlo Sirimalle Chettu) సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తేజస్వి మదివాడ(Tejaswi Madivada) మనందరికీ సుపరిచితమే.

దిశ, వెబ్‌డెస్క్: ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’(seethamma Vakitlo Sirimalle Chettu) సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తేజస్వి మదివాడ(Tejaswi Madivada) మనందరికీ సుపరిచితమే. ఆ తర్వాత ‘మనం’(Manam), ‘హార్ట్ ఎటాక్’(Heart Attack) వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma) దర్శకత్వంలో వచ్చిన ‘ఐస్‌క్రీం’(Ice Cream) చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత బిగ్ బాస్(Bigg Boss) హౌజ్‌లో అడుగు పెట్టి బుల్లితెర ఆడియెన్స్‌కు చేరువైంది.
ప్రస్తుతం ఈ భామ టీవీ షోలతో బిజీబిజీగా ఉంటోంది. అలాగే సోషల్ మీడియా(Socail Media)లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ క్రేజీ ఫొటోస్, వీడియోలను షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్‌లో ఉంటోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న తేజస్వి మదివాడ ఎమోషనల్ అయ్యింది. చిన్న తనంలోనే తల్లి చనిపోయిందని చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం తేజస్వి కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ అనే టీవీ షోలో చేస్తుంది. ఈ షోలో ఫ్యామిలీ థీమ్ ఎపిసోడ్ షూట్ చేశారు. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.
అందులో “నాకు పదేళ్ల వయసులోనే మా అమ్మ చనిపోయారు. మా నాన్న మమ్మల్ని పట్టించుకోలేదు. దాంతో నేను 18 ఏళ్ళప్పుడు ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. ఆ తర్వాత రోహిత్ భరద్వాజ్ ఫ్యామిలీ నన్ను చూసుకుంటుంది. నేను ఎప్పుడూ జనాల్లో ఉండటానికి ఇష్టపడతాను. ఎందుకంటే నేను ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవుతుంటా.. షూటింగ్ సెట్‌కు వస్తే నాకు ఓ పండగలా ఉంటుంది” అని కన్నీళ్లు పెట్టుకుంది తేజస్వి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.






