- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వయసు పెరిగాక పిల్లలు పుట్టడం వల్లే నా ఆలోచనలు మారాయి: సైఫ్ అలీఖాన్
తన ఇద్దరు చిన్న కొడుకులు (తైమూర్, జెహంగీర్) పుట్టిన తర్వాతే జీవితంలో కుటుంబానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఏంటో తెలిసి వచ్చిందని చెప్పారు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ‘కర్తవ్య’ అనే ఓటీటీ సినిమాతో అలరించబోతున్నారు. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మే15నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. పుల్‌కిత్ దర్శకత్వంలో తెరకెక్కగా.. ఇందులో రసిక, సౌరభ్,సంజయ్ కీలక పాత్రలో నటించారు. ఇదిలా ఉంటే..తాజాగా తన వ్యక్తిగత జీవితం, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన ఇద్దరు చిన్న కొడుకులు (తైమూర్, జెహంగీర్) పుట్టిన తర్వాతే జీవితంలో కుటుంబానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఏంటో తెలిసి వచ్చిందని చెప్పారు. నటుడిగా కెరీర్‌లో ఎదగడానికి చేసే ప్రయత్నాలను సైఫ్ కొండలు ఎక్కడంతో పోల్చారు. మన ఇల్లు అనేది ఒక బేస్ క్యాంప్ లాంటిది.
కొండలు ఎక్కి అలసిపోయినప్పుడు తిరిగి వచ్చి కాసేపు ప్రశాంతంగా గడపడానికి ఆ బేస్ క్యాంప్ ఎంతో అవసరం. కానీ, ఒక వ్యక్తి ఎప్పుడూ కొండలు ఎక్కుతూ (కెరీర్ వెనకాలే పరుగెడుతూ) ఉండిపోతే.. ఒకరోజు వెనక్కి తిరిగి చూసుకునేసరికి కుటుంబం లేకుండా ముక్కలైపోతుంది" అంటూ నటులు చేసే త్యాగాల గురించి చెప్పారు. కరీనా కపూర్ ఖాన్‌తో వివాహం తర్వాత, లేటు వయసులో పిల్లలు కలగడం వల్లే తన ఆలోచనల్లో మార్పు వచ్చిందని సైఫ్ తెలిపారు. అలాగే.. ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు ఉండే షూటింగ్ షిఫ్టులు తనకు అస్సలు నచ్చవని, రాత్రి 11 గంటలకు ఇంటికి రావడం అనేది అస్సలు జీవితమే కాదని ఆయన తెగేసి చెప్పారు. అందుకే ఇప్పుడు సాయంత్రం కాగానే పిల్లల కోసం ఇంటికి చేరుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.






