- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అతను తన స్నేహితులతో రాత్రి గడపాలని ఇబ్బంది పెట్టేవాడు.. స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!
ఒకప్పటి స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్(Karisma Kapoor) బాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి ఇండస్ట్రీని షేక్ చేసింది.

దిశ, సినిమా: ఒకప్పటి స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్(Karisma Kapoor) బాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి ఇండస్ట్రీని షేక్ చేసింది. తన అందం, నటనతో ఎంతో మంది అభిమానులు దక్కించుకున్న ఆమె హిట్ మూవీస్ చేసి ఓ మార్క్ క్రియేట్ చేసింది. కానీ కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఆమె పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయింది. అయితే ఆమె కాపురం సాఫీగా సాగలేదు. భర్తతో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయింది. దీంతో మళ్లీ కరిష్మా ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది. గత ఏడాది ‘మర్డర్ ముబారక్’ (Murder Mubarak)సినిమాతో వచ్చి ప్రేక్షకుల అలరించింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరిష్మా తన మాజీ భర్తపై సంచలనన వ్యాఖ్యలు చేసింది.
‘‘నా భర్త మొదట్లో బాగానే ఉండేవాడు. కానీ రాను రాను అతనిలో చాలా మార్పు వచ్చింది. దాన్ని నేను అసలు ఊహించలేదు. అతను అంతకు దిగజారుతాడని అనుకోలేదు. నా మాజీ భర్త తన స్నేహితుల వద్ద నన్ను వేలం వేసేవాడు. ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వారితో నన్ను ఆ రోజు రాత్రి గడపాలని బలవంతం చేసేవాడు. ఇలాంటి పనులు చేసి నన్ను హింసించేవాడు. వాటన్నింటినీ భరించలేకనే అతను నుంచి విడాకులు తీసుకున్నాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ కావడంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా షాక్‌కు గురవుతున్నారు. అయితే ఈ విషయాన్ని కరిష్మా చెప్పడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు.. ఎన్నోసార్లు చెప్పిన సంగతి తెలిసిందే.






