నా భర్త అలాంటి వ్యాధితో బాధపడుతున్నాడు.. నాని హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

by Gugulothu.Kavitha |

‘రాజా రాణి’(Raja Rani) సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన హీరోయిన్ నజ్రియా(Nazriya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

నా భర్త అలాంటి వ్యాధితో బాధపడుతున్నాడు.. నాని హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: ‘రాజా రాణి’(Raja Rani) సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన హీరోయిన్ నజ్రియా(Nazriya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని(Nani) సరసన ‘అంటే సుందరానికి’(Ante Sundaraniki) అనే మూవీలో నటించింది. తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినప్పటికీ క్రేజ్ మాత్రం స్టార్ హీరోయిన్‌కి ఉన్నంత ఉంది. అయితే ఈ బ్యూటీ భర్త ఫహాద్ ఫాజిల్(Fahad Fassil) కూడా నటుడు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆయన సుకుమార్(Sukumar) దర్శకత్వం వహించిన ‘పుష్ప’(Pushpa) మూవీలో భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీస్ ఆఫీసర్‌గా నటించి మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు.

ఇక ఈ జంట 2014లో అంజలి రచన(Anjali Rachana) దర్శకత్వం వహించిన ‘బెంగుళూరు డేస్’(Bangalore Days) చిత్రంలో భార్య, భర్తలుగా నటించి నిజ జీవితంలో కూడా వీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయిపోయారు. ఇక పెళ్లి తర్వాత ఈ కపుల్ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. నజ్రియా మలయాళంలో సినిమాలు చేస్తుంటే.. ఫహద్ ఫాజిల్ రీసెంట్‌గా తెలుగులో ‘పుష్ప 2’(Pushpa-2)తో భారీ హిట్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నజ్రియా తన భర్తకు అరుదైన వ్యాధి ఉందని చెప్పి షాక్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. “ఫహద్ కొన్ని నెలల నుంచి ADHD తో బాధపడుతున్నాడు. ADHD ఉన్నవారు ఎప్పుడూ.. పరధ్యానం, చికాకు కలిగి ఉంటారు. అలాగే ఈ వ్యాధితో బాధపడుతున్న వారిలో హైపర్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది.

కానీ అతని పరిస్థితి గురించి తెలియక ముందే నేను షాను (ఫహద్)తో కలిసి జీవించడం ప్రారంభించాను. నేను అతని వ్యక్తిత్వ లక్షణాలకు చాలా కాలంగా అలవాటు పడ్డాను అండ్ అవి మా జీవితంలో భాగమయ్యాయి. అతని పరిస్థితి గురించి పూర్తిగా తెలుసుకున్నాను. ఇప్పుడు నాకు కాస్త ఓపిక వచ్చింది కానీ అంతకు మించి మా జీవితంలో ఏమీ మారలేదు” అని నజ్రియా ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ భామ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఫహాద్ ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Next Story