నాకు అలాంటి మొగుడే కావాలి.. ఇంటర్వ్యూలో ఓపెన్ అయిన విష్ణు ప్రియ

by Pulgam srinivas |

విష్ణు ప్రియ తాజాగా మాట్లాడుతూ... తన తల్లి శ్రియ, ఆర్తి అగర్వాల్‌కు హెయిర్ డ్రెస్సర్‌గా పనిచేసింది, దానితో ఆమెకు సినిమా పరిశ్రమపై అవగాహన ఉంది. ఆమె నన్ను కూడా సినిమా ఇండస్ట్రీలోకి తీసుకురావాలని అనుకుంది. ముఖ్యంగా సీరియల్స్‌లో నన్ను చూడాలని అనుకుంది. ప్రస్తుతం నాకు పెళ్లిపై ఆసక్తి ఉంది. నాకు కాబోయే భర్త ఫిజికల్‌గా ఫిట్‌గా, ఐపీఎస్ లేదా పైలట్ అయి ఉంటే బాగుంటుందని విష్ణు ప్రియ చెప్పుకొచ్చింది.

నాకు అలాంటి మొగుడే కావాలి.. ఇంటర్వ్యూలో ఓపెన్ అయిన విష్ణు ప్రియ
X

దిశ, వెబ్ డెస్క్ : మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ మరియు నటి అయిన విష్ణు ప్రియ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె సుధీర్ తో కలిసి ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయిన పోవే పోరా టీవీ షోకు యాంకర్గా వ్యవహరించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత పలు టీవీ షోలకు యాంకర్గా వ్యవహరించి తన పాపులారిటీని బాగా పెంచుకుంది. అలాంటి సమయంలోనే ఈ నటి బిగ్ బాస్ రియాల్టీ షో లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని ద్వారా కూడా విష్ణు ప్రియ మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ప్రస్తుతం ఈమె టీవీ షోలలో పార్టిసిపేట్ చేస్తూనే వెబ్ సిరీస్, సినిమాల్లో కూడా నటిస్తూ కెరీర్ను ముందుకు సాగిస్తోంది. ఈ చిన్నది సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారు హాట్ బీట్ను పెంచుతుంది. ఈమెకు సోషల్ మీడియాలో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా విష్ణు ప్రియ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో ఆమె తన పర్సనల్ విషయాలను చెప్పింది, అలాగే తనకు ఎలాంటి భర్త కావాలో అనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చింది.

తాజాగా విష్ణు ప్రియ మాట్లాడుతూ... తన తల్లి శ్రేయ, ఆర్తి అగర్వాల్ కి హెయిర్ డ్రెస్సర్‌గా పనిచేసింది. దానితో ఆమెకు సినిమా పరిశ్రమపై ఎంతో అవగాహన ఉండేది. నన్ను కూడా సినిమా ఇండస్ట్రీలోకి తీసుకురావాలని ఆమె అనుకుంది. ముఖ్యంగా నన్ను సీరియల్స్ లో చూడాలని అనుకునేది. ప్రస్తుతం నేను జీవిత భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నాను. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉంది. తనకు కాబోయే భర్త ఫిజికల్‌గా ఫిట్‌గా, ఐపీఎస్ లేదా పైలట్ అయి ఉండాలని ఆమె చెప్పుకొచ్చింది.

Next Story