- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా తండ్రే నన్ను చిత్ర హింసలు పెట్టేవాడు.. బాగా కొట్టి గాయాలపై కారం పూసేవాడు.. గాయత్రి గుప్తా సంచలనం
టాలీవుడ్ కాంట్రవర్సీ యాక్టర్ గాయత్రీ గుప్తా(Gayathri Guptha) గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ కాంట్రవర్సీ యాక్టర్ గాయత్రీ గుప్తా(Gayathri Guptha) గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ బ్యూటీ ‘ఫిదా’(Fidaa), జంధ్యాల రాసిన ప్రేమకథ, సీత ఆన్ ది రెడ్, బుర్రకథ, వంటి చిత్రాల్లో లిమిటెడ్ రోల్స్‌లో నటించి మెప్పించింది. ఇక ఈ చిన్నది టాలీవుడ్‌లో ఉండే క్యాస్టింగ్ కౌచ్ గురించి, అలాగే బిగ్ బాస్ షో బాగోతాల పైన నోరు విప్పి హాట్ టాపిక్ అయింది, ఫెమినిజం, పురుషాధిక్యత, వస్త్రధారణ తదితర విషయాల్లో కూడా తన వాయిస్‌ని గట్టిగా వినిపిస్తూ.. ఎవడు ఏమనుకుంటే నాకేంటి నాకు నచ్చినట్టు నేనుంటా తప్పేంటి అన్న శైలిలీ స్పందిస్తుంటది.
ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిన్నది చేసిన ఓపెన్ కామెంట్స్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఆమె మాట్లాడుతూ.. “సాధారణంగా అమ్మాయిలు ఎక్కువగా తండ్రిలాంటి వ్యక్తిని జీవిత భాగస్వామిగా కోరుకుంటారు. కానీ నాకు ఫాదర్ అంటేనే అసహ్యం వేస్తుంది. నా తండ్రే నన్ను చిత్రహింసలు పెట్టాడు. కరెంట్ వైర్‌తో కొట్టడం, ఆ గాయాలపై కారం రాయడం వంటివి చేసి అమానుషంగా వ్యవహరించాడు” అని గాయత్రీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.






