- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'నా తండ్రే నా సూపర్ హీరో'.. ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
ప్రతి ఏడాది జూన్ మూడో ఆదివారం ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డే (Father's Day) జరుపుకుంటారు

దిశ, వెబ్ డెస్క్: ప్రతి ఏడాది జూన్ మూడో ఆదివారం ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డే (Father's Day) జరుపుకుంటారు. ఈ సందర్భంగా టాలీవుడ్ నటులు వారి తండ్రితో ఉన్న అనుబంధాలను, జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) తండ్రి కొణిదెల వెంకట్రావు (Konidela Venkar Rao)ను గుర్తుచేసుకుంటూ ట్విట్టర్ వేదికగా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. 'పిల్లలు స్థిరంగా ఉండడానికి, జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి నాన్న ఎంతో తోడ్పాటు అందిస్తారు. నా తండ్రి నా సూపర్ హీరో. తమ బలం, జ్ఞానం, ప్రేమతో జీవితాలను తీర్చిదిద్దే ప్రపంచంలోని అద్భుతమైన తండ్రులందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు' అని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
కాగా, చిరంజీవి నాన్న వెంకట్రావు పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేశారు. ఉద్యోగ రీత్యా ఆయనకు పలు ప్రాంతాలకు బదిలీలు జరిగడంతో చిరంజీవి బాల్యం నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూరు వంటి వివిధ ప్రాంతాల్లో గడిచింది. ఇక ప్రస్తుతం చిరంజీవి మల్లిడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తోన్నారు.






