నా మాజీ ప్రియుడు పెద్ద సైకో నన్ను సిగరెట్‌తో కాల్చి హింసించాడు.. టాలీవుడ్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

గతంలో తాను ప్రేమించిన వ్యక్తి ఒక సైకో అని, తనతో చాలా హింసాత్మకంగా ప్రవర్తించేవాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

నా మాజీ ప్రియుడు పెద్ద సైకో నన్ను సిగరెట్‌తో కాల్చి హింసించాడు.. టాలీవుడ్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ నితి టేలర్ 2009లో 'ప్యార్ కా బంధన్' సీరియల్‌తో టెలివిజన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన 'కైసీ యే యారియాన్' సీరియల్‌తో ఆమెకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఇందులో పార్థ్ సమథాన్‌తో ఆమె కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాగే గులామ్, ఇష్క్‌బాజ్, ఝలక్ దిఖ్లా జా 10 వంటి పాపులర్ షోలలో నటించిన ఆమె, 2012లో ‘మేం వయసుకు వచ్చాం’ సినిమాతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయ్యారు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో తనీష్ సరసన నితి టేలర్ నటించగా.. ఓ ముస్లీం అమ్మాయిగా తెలుగు కుర్రాలందరినీ ఫిదా చేశారు.అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడంతో నితికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాలు చేసినప్పటికీ పెద్దగా హిట్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం నీతి టేలర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతున్న 'అలయన్స్' అనే రియాలిటీ గేమ్ షోలో పాల్గొంటున్నారు.

ఇందులో భాగంగా తన గతంలో జరిగిన ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. గతంలో తాను ప్రేమించిన వ్యక్తి ఒక సైకో అని, తనతో చాలా హింసాత్మకంగా ప్రవర్తించేవాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరోజు రాత్రి అతని పుట్టినరోజు నాడే పిచ్చివాడిలా మారి తనపై దాడి చేశాడని, చివరికి తనను సిగరెట్‌తో కూడా కాల్చాడని నీతి టేలర్ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో తన శరీరంపై పడిన ఆ గాయాన్ని కూడా ఆమె అందరికీ చూపించారు. అప్పట్లో తాను చాలా చిన్నపిల్లని కావడం వల్ల, ఎవరి క్యారెక్టర్ ఎలాంటిదో సరిగ్గా అంచనా వేయలేకపోయానని, ఆ దెబ్బతో అతనికి గుడ్‌బై చెప్పేసి బయటకు వచ్చేసానని ఆమె వివరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story