- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ranbir Kapoor: నా కల నిజమైందంటూ రణ్‌బీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) గత ఏడాది ‘యానిమల్’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) గత ఏడాది ‘యానిమల్’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన ‘రామాయణ’(Ramayana) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఇటీవల ఈ సినిమా విడుదల తేదీ ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. 2026 దీపావళికి మొదటి పార్ట్, 2027లో రెండో పార్ట్ వస్తుందని తెలిపారు. దీంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే దీనిని నితీశ్ తివారీ తెరకెక్కిస్తుండగా.. రాముడు, సీత పాత్రల్లో రణ్‌బీర్, సాయి పల్లవి నటిస్తున్నారు.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రణ్‌బీర్ ‘రామాయణ’ షూటింగ్ అప్డేట్ ఇస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘ఈ ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఎంతో గొప్ప కథ. చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాను. అయితే ఎంతో మంది ప్రతిభావంతులైన కళాకారులు ఇందులో వర్క్ చేస్తున్నారు. నితీశ్ తివారీ(Nitish Tiwari) దీన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. పార్ట్-1లో నా భాగం షూటింగ్ పూర్తి చేశాను. త్వరలోనే పార్ట్-2 షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఇలాంటి పాత్రలో నటించడం నా కల. ఈ చిత్రంతో అది నిజమైంది. మన భారతీయ సంస్కృతి, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప సినిమా ‘రామాయణ’’ అని చెప్పుకొచ్చాడు






