కమర్షియల్ ‘మ్యూజిక్ మూవ్‌మెంట్స్’

by Sujitha Rachapalli |

తల్లాడ సాయికృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘మ్యాజిక్ మూవ్‌మెంట్స్’. మీరు అనుకున్నది కాదు అనేది శీర్షిక. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కె.దశరథ్ సమర్పకులుగా వ్యవహరిస్తుండగా.. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, శ్రీ లక్ష్మి శ్రీనివాస ఫిలిమ్స్ బ్యానర్స్‌పై తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.

కమర్షియల్ ‘మ్యూజిక్ మూవ్‌మెంట్స్’
X

దిశ, సినిమా : తల్లాడ సాయికృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘మ్యాజిక్ మూవ్‌మెంట్స్’. మీరు అనుకున్నది కాదు అనేది శీర్షిక. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కె.దశరథ్ సమర్పకులుగా వ్యవహరిస్తుండగా.. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, శ్రీ లక్ష్మి శ్రీనివాస ఫిలిమ్స్ బ్యానర్స్‌పై తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. వెంకట్ దుగ్గిరెడ్డి సహ నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన తల్లాడి వెంకన్న.. ‘నన్ను నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేసింది సాయికృష్ణ. నేను హీరోగా ఒక్కడే అనే మూవీని చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో థియేటర్స్ రిలీజ్ చేశాను. ఇప్పుడు ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ (మీరు అనుకున్నది కాదు) సినిమాను మంచి కమర్షియల్ అంశాలతో నిర్మిస్తున్నాం. ఈ సినిమాలో థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో నేనొక ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లో నటించాను. తల్లాడ సాయితో ఈ సినిమా తర్వాత మరో పెద్ద సినిమా కూడా నిర్మించబోతున్నా’ అని తెలిపారు. కార్యక్రమానికి డీవోపీ సతీష్ రెడ్డి మాసం, డాక్టర్ ఏఎంఆర్, సహ నిర్మాత వెంకట్ దుగ్గిరెడ్డి, హీరోయిన్ ఏకాదంతాయ సిరి, నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల, హీరో, దర్శకుడు తల్లాడ సాయికృష్ణ, చిత్ర సమర్పకులు దశరథ్ తదితరులు హాజరయ్యారు.

Next Story