- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chiranjeevi Blood Bank: చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేసిన ప్రముఖ సంగీత దర్శకుడు.. వీడియో వైరల్
తెలుగు చిత్రపరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) క్రేజ్ అందరికి తెలిసిందే.

దిశ, సినిమా: తెలుగు చిత్రపరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) క్రేజ్ అందరికి తెలిసిందే. వెండితెరపై తన నటన, డాన్సులతో ఎంతో మంది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్న ఆయన.. నిజ జీవితంలో ‘చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్’ (Chiranjeevi Blood Bank)ను స్థాపించి తన అభిమానుల సహకారంతో ఎనలేని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోన్నారు. ఈ చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో అభిమానులు (fans), సినీ సెలబ్రిటీలు (Movie celebrities) ఎందరో రక్తదానం చేస్తుంటారు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ రక్తదానం చేసి చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇలా మణిశర్మ రక్తదానం (blood donation) చేయటం ఇది రెండోసారి కావటం విశేషం.
ఈ సందర్భంగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ (Mani Sharma) మాట్లాడుతూ ‘ఎప్పటి నుంచో రక్త దానం చేయాలని అనుకుంటున్నాను. నేను నా సంగీతాన్ని చిరంజీవిగారి సినిమాలకు అందించటం ద్వారా అభిమానాన్ని చాటుకున్నాను. ఇప్పుడు రక్తదానం చేయటం అనేది సంతోషంగా ఉంది.. నా వంతు కర్తవ్యంగా భావిస్తున్నాను. లక్షలాది మంది ఇందులో భాగమైయ్యారు. అందులో నేను ఒక బొట్టులాగా ఇప్పుడు చేరాను. ఇలాంటి మంచి కార్యక్రమంలో అందరూ భాగం కావాలి’ అని తెలిపారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.






