- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పెద్ది’ షూటింగ్‌లో పాల్గొనడానికి వచ్చేసిన మున్నా భాయ్.. వీడియో వైరల్
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్(Ram Charan) ‘పెద్ది’(Peddi) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్(Ram Charan) ‘పెద్ది’(Peddi) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దీనికి ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనా(Buchi babu Sana) దర్శకత్వం వహిస్తున్నాడు. రామ్ చరణ్ కెరీర్‌లో 16వ సినిమాగా వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టైటిల్ పోస్టర్, ఫస్ట్ షాట్‌ను గ్లింప్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి.
ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో టాలీవుడ్ హాట్ బ్యూటీ పూజ హెగ్డే(Pooja Hegde) చరణ్ తో కలిసి స్టెప్పులేయనుందని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో 'మీర్జాపూర్'లో మున్నా భయ్యా పాత్ర పోషించి, పాపులర్ అయిన నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పెద్ది మూవీ షూటింగ్‌లో పాల్గొనేందుకు మన మున్నాభాయ్ హైదరాబాద్‌కి విచ్చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.






