రూ.252 కోట్ల డగ్స్ కేసులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఓర్రీకి సమన్లు

by Ajay Maddhiboyina |

బాలీవుడ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఓర్రీ ఓర్హాన్ అవత్రమణికి రూ.252 కోట్ల డ్రగ్స్ కేసులో ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు యాంటీ నార్కోటిక్ సెల్ ఘట్కోపర్ యూనిట్ ముందు హాజరు కావాలని ఆదేశించారు.

రూ.252 కోట్ల డగ్స్ కేసులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఓర్రీకి సమన్లు
X

దిశ‌, వెబ్ డెస్క్: బాలీవుడ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఓర్రీ ఓర్హాన్ అవత్రమణికి రూ.252 కోట్ల డ్రగ్స్ కేసులో ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు యాంటీ నార్కోటిక్ సెల్ ఘట్కోపర్ యూనిట్ ముందు హాజరు కావాలని ఆదేశించారు. అయితే ఈ కేసులో ఓర్రీ పాత్ర ఏంటో పోలీసులు వెల్ల‌డించ‌లేదు కానీ విచార‌ణ‌లో మాత్రం ఆయ‌న పేరు క‌నిపిస్తోంది. మ‌రోవైపు ఇటీవల యూఏఈ నుండి వ‌చ్చిన స‌లీం డోలా కుమారుడు తాహెర్ డోలాకు సంబంధించిన విచార‌ణ ప‌త్రాల్లోనూ ఓర్రీ పేరు బ‌య‌ట‌ప‌డిన‌ట్టు క‌థ‌నాలు వ‌చ్చాయి.

స‌లీం డోలా పై సైతం డ్ర‌గ్స్ ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఓర్రీ అస‌లు సినిమాలు చేయ‌పోయినా అత‌డికి సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. హీరోయిన్లు అత‌డితో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగ‌బ‌డుతుంటారు. మిలియన్స్ కొద్దీ ఫాలోవ‌ర్స్ ఉన్న ఓర్రీ త‌న‌తో సెల్ఫీలు దిగేందుకు కూడా భారీగా డ‌బ్బు తీసుకుంటాడ‌నే టాక్ ఉంది. అంతేకాకుండా పార్టీల‌కు వెళ్లేందుకు కూడా భారీగానే పుచ్చుకుంటాడ‌ని తెలుస్తోంది.

Next Story