- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కమెడియన్ కపిల్ శర్మకు బెదిరింపులు.. భద్రత పెంచిన ముంబై పోలీసులు
బాలీవుడ్ హాస్య నటుడు కపిల్ శర్మకు ఇటీవల ఓ వ్యక్తి నుంచి బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హాస్య నటుడు కపిల్ శర్మకు ఇటీవల ఓ వ్యక్తి నుంచి బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. దిలీప్ చౌదరి అనే వ్యక్తి తనకు కోటి రూపాయలు ఇవ్వాలని, తాను గోల్డీ బ్రార్ అండ్ రోహిత్ గోదారా గ్యాంగ్ కు చెందినవాడినంటూ ఈమెయిల్ పంపాడు. దాంతో కపిల్ శర్మ పోలీసుల్ని ఆశ్రయించగా.. శనివారం దిలీప్ ను పశ్చిమ బెంగాల్ లోని 24 పరగణాల జిల్లాలో అరెస్ట్ చేశారు. అతనికి నిజంగానే ఆయా గ్యాంగ్ స్టర్లతో సంబంధాలున్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
కెనడాలోని సర్రేలో ఉన్న కపిల్ శర్మ రెస్టారెంట్ కాప్స్ కేఫ్ లో నెలరోజుల్లో రెండుసార్లు కాల్పులు జరిగాయి. ఈ సంఘటన జరిగిన కొన్ని వారాలకే బెదిరింపులు రావడం, అరెస్ట్ జరగడంతో.. కపిల్ శర్మకు ప్రాణహాని ఉందన్న అనుమానాలను రేకెత్తించాయి. జులై10న ఒకసారి కాల్పులు జరగ్గా.. ఆగస్టు 28న కేఫ్ పై 25 రౌండ్లు కాల్పులు జరగ్గా.. ఆస్తినష్టం జరిగిందని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని శర్మ తెలిపారు. ఆగస్టులో జరిపిన కాల్పులకు పాల్పడింది తామేనంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు చెందిన సభ్యుడు గోల్డీ ధిల్లాన్ సోషల్ మీడియాలో ప్రకటించాడు. ప్రస్తుతం అతని జర్మనీలో ఉంటుండగా.. అతనిపై పంజాబ్ లో అనేక దోపిణీ, హత్య కేసులు నమోదైనట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. జులై నెలలో రెస్టారెంట్ పై జరిపిన కాల్పులకు తామే కారణమంటూ.. బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ కార్యక్ర, ఇండియా మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న హర్జిత్ సింగ్ లడ్డి ప్రకటించుకున్నాడు. నిహాంగ్ సిక్కుల్ని ఉద్దేశించి శర్మ చేసిన వ్యాఖ్యల కారణంగానే ఈ దాడి చేసినట్లు చెప్పాడు. కాగా.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ముంబై పోలీసులు కపిల్ శర్మకు సెక్యూరిటీ పెంచారు.






