- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మల్టీ స్టారర్ మూవీ ‘భైరవం’ ట్రైలర్ రిలీజ్.. యాక్షన్ మోడ్‌లోకి ముగ్గురు హీరోలు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న డైలాగ్స్
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘భైరవం’(Bhairavam).

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘భైరవం’(Bhairavam). విజయ్ కనకమేడల దర్శకత్వంలో రాబోతున్న ఈ మల్టీ స్టారర్‌లో మంచు మనోజ్(Manchu Manoj), నారా రోహిత్(Nara Rohit) కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీసత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై రాధామోహన్ నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీలో దివ్య పిళ్లై, అదితి శంకర్, ఆనంది హీరోయిన్లుగా నటిస్తుండగా.. జయసుధ, ప్రియమణి కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా భారీ అంచనాల మధ్య ‘భైరవం’మే 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో.. ప్రమోషన్స్ జోరు పెంచిన మేకర్స్ అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా, ‘భైరవం’ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రజలకు కాపాడేందుకు వస్తాడు. గుడి వద్ద డ్యాన్స్ చేస్తూ వైల్డ్ లుక్‌లో కనిపిస్తాడు. ఈ ట్రైలర్ చూస్తే ‘భైరవం’ ఓ ముగ్గురు మిత్రుల చుట్టూ సాగే యాక్షన్ కథగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ధర్మాన్ని కాపాడటానికి ఈ ముగ్గురు పోరాటం చేస్తారు. గుడి ఆస్తి, నగలను కాపాడుతారు.
ఇక ఇందులో మంచు మనోజ్ చెప్పిన డైలాగ్స్ ‘‘ఎదుటి వాడు మన మీద కన్నేసేలోపే మనం మన్ను వేసేయాలి’’ అని చెప్పే గూస్ బంప్స్‌ను తెప్పిస్తున్నాయి. ఈ కథాంశం గ్రామస్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీక అయిన పవిత్ర వారాహి ఆలయం చుట్టూ తిరుగుతుంది. రాష్ట్ర అండ్‌మెంట్ మంత్రికి ఆ ఆలయం భూములపై కన్నపడి, వాటిని వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగించాలనే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో గ్రామ శాంతి భంగం అవుతుంది. అప్పుడు ముగ్గురు స్నేహితులు కలసి, ఆలయాన్ని, దాని వారసత్వాన్ని రక్షించేందుకు బలంగా నిలబడతారు. వారి మధ్య ఉన్న బంధం, ధైర్యం గ్రామ ప్రజలకు ఆశను నింపుతుంది. కమర్షియల్ వాల్యుస్ తో కూడిన కథను దర్శకుడు విజయ్ కనకమేడల ఎక్సయిటింగ్, ఇంపాక్ట్ ఫుల్ గా ప్రెజెంట్ చేశారు. తొలి షాట్ నుండి చివరి ఫ్రేమ్ వరకు సినిమాను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పాత్రలో వెర్సటాలిటీ చూపించి అదరగొట్టారు, ముఖ్యంగా శివ తాండవం సీక్వెన్స్ , చివరిలో వచ్చే యాక్షన్ సన్నివేశంలో అద్భుతంగా కనిపించారు. మంచు మనోజ్ ఇంటెన్స్ క్యారెక్టర్ కట్టిపడేశారు నారా రోహిత్ కూడా తన పాత్రను పవర్‌ఫుల్‌గా పోషించి ఆకట్టుకుంటారు. ఈ ముగ్గురు నటుల పర్ఫార్మెన్స్ అద్భుతంగా నిలిచింది, ప్రతి ఒక్కరికి సమానంగా స్కోప్ ఇచ్చిన దర్శకుడికి క్రెడిట్ దక్కుతుంది. ఆదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్ళై పాత్రలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి. హరి కె వేదాంతం కెమెరా వర్క్ సినిమాకు విజువల్ గ్రాండ్‌నెస్ తీసుకొచ్చింది. శ్రీ చరణ్ పాకాల ఇచ్చిన నేపథ్య సంగీతం ఎమోషన్ ని ఎలివేట్ చేసింది. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్, చిన్నా కె ప్రసాద్ ఎడిటింగ్ మరింత బలాన్ని ఇచ్చాయి. సత్యర్షి, తూమ్ వెంకట్ డైలాగ్స్ పవర్‌ఫుల్‌గా ఆకట్టుకున్నాయి. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పెన్ స్టూడియోస్ నిర్మాణ విలువలు ఉన్నంతగా ఉన్నాయి. యాక్షన్, ఎమోషన్స్ సమర్థంగా మేళవించిన ఈ ట్రైలర్, ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుందని సూచిస్తోంది.






