- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
M.S.Raju: రాత్రి మూడు గంటలకు ఫోన్.. త్రిషపై స్టార్ ప్రొడ్యూసర్ సంచలన వ్యాఖ్యలు
ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ... త్రిష ఒక ఇంటర్వ్యూలో “రాత్రి మూడు గంటలకు ఏదైనా సమస్య ఎదురైతే ఫోన్ చేయాల్సి వస్తే ఎమ్మెస్ రాజు గారికే ఫోన్ చేస్తాను” అని చెప్పినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న వారిలో ఎమ్మెస్ రాజు ఒకరు. ఈ మధ్యకాలంలో ఆయన సినిమాలు నిర్మించడం కంటే దర్శకత్వంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తాజాగా “అగధ” అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ త్రిష గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ— త్రిష మా బ్యానర్‌లో వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే రెండు చిత్రాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు మంచి విజయాలు సాధించాయి.
అయితే వర్షం సినిమాలో ఆమెను ఎంపిక చేయడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉందని చెప్పారు. మొదట త్రిషను మహేష్ బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన అర్జున్ చిత్రానికి హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఆ తర్వాత ఒక రోజు అనుకోకుండా మహేష్ బాబు దగ్గర త్రిష ఫోటోలు చూసాను. “అమ్మాయి బాగుంది, మా సినిమాలో హీరోయిన్‌గా తీసుకోమంటారా? అని అడగగా, ఆయన ఓకే చెప్పారు. అనంతరం చెన్నై వెళ్లి త్రిషను, ఆమె తల్లిని కలిసి కథ చెప్పి వర్షం చిత్రానికి హీరోయిన్‌గా ఎంపిక చేశాము.
ఇక నువ్వు వస్తానంటే నేనొద్దంటానా సినిమాకు కూడా త్రిషను ముందుగా అనుకోలేదని, కానీ ఒకసారి ఆమె తమ ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు తన కాల్షీట్ డైరీ చూపిస్తూ “ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ సినిమాకు డేట్స్ ఇస్తాను” అని చెప్పడంతో ఆ చిత్రానికి ఆమెనే ఎంపిక చేసినట్లు తెలిపారు. అలాగే త్రిష తనను గురువులా భావిస్తుందని ఎమ్మెస్ రాజు అన్నారు. ఒక ఇంటర్వ్యూలో “రాత్రి మూడు గంటల సమయంలో ఎవరికైనా సహాయం కోసం ఫోన్ చేయాల్సి వస్తే ఎవరికి చేస్తారు?” అని ప్రశ్నించగా త్రిష ఎలాంటి సందేహం లేకుండా ఎమ్మెస్ రాజుకే ఫోన్ చేస్తానని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. దీంతో త్రిష తనపై చూపించే అభిమానాన్ని ఆయన వెల్లడించారు.






