MS Raju: షూటింగ్‌లో అలా జరిగింది.. మేమంతా కంగారు పడితే వనిత విజయ్ కుమార్ అలా అంది

by Pulgam srinivas |

ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ… “దేవి సినిమా షూటింగ్లో వనిత విజయ్ కుమార్‌ను పాము కాటేసింది. దాంతో మేమంతా కంగారు పడిపోయాం. కానీ ఆమె మాత్రం ఎంతో కూల్‌గా వ్యవహరించింది” అని చెప్పుకొచ్చాడు.

MS Raju: షూటింగ్‌లో అలా జరిగింది.. మేమంతా కంగారు పడితే వనిత విజయ్ కుమార్ అలా అంది
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతగా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఎమ్మెస్ రాజు ఒకరు. ఒకప్పుడు వరుస సినిమాలను నిర్మించిన ఈయన, ప్రస్తుతం దర్శకత్వంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అందులో భాగంగా తాజాగా “అగధ” అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లను మూవీ బృందం వరుసగా విడుదల చేస్తోంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో సినిమాలో నటించిన నటీనటులతో పాటు టెక్నీషియన్స్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఎమ్మెస్ రాజు, నటి వనిత విజయ్ కుమార్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ… “దేవి సినిమా షూటింగ్ సమయంలో వనిత విజయ్ కుమార్‌ను పాము కాటేసింది. ఆ సమయంలో సెట్లో ఉన్న మేమంతా చాలా టెన్షన్ పడ్డాం. కానీ వనిత మాత్రం చాలా కూల్‌గా ‘నాకు ఏమీ కాదు… అమ్మవారు నన్ను కాపాడుతుంది’ అని చెప్పింది. ఎంత పెద్ద సమస్య వచ్చినా చాలా ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తి ఆమె” అని అన్నారు. ఇక “అగధ” సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై మంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది. మరి ఈ చిత్రం విడుదల తర్వాత ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.

Next Story