- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mrunal Thakur: ఎన్నో నిద్రలేని రాత్రులు లెక్కలేనన్ని క్షణాలు.. మృణాల్ ఠకూర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్
యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. ‘సీతారామం’ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. ‘సీతారామం’ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయి.. వరుస ఆఫర్ల అందుకుంది. ఈ క్రమంలోనే ‘హాయ్ నాన్న’ తో మరో సాలిడ్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. వీటిలో ‘సస్నాఫ్ సర్దార్-2’ ఒకటి. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటించిన ‘సన్నాఫ్ సర్దార్’కు సీక్వెల్‌గా రాబోతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్ కుమార్ అరోరా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. దేవ్‌గణ్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని జ్యోతి దేశ్‌పాండే, అజయ్ నిర్మిస్తున్నారు.
యాక్షన్ కామెడీ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో సంజయ్ దత్, సాహిల్ మెహతా, సంజయ్ మిశ్రా, రవికృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎన్నో అంచనాల మధ్య ఈ మూవీ ఆగస్టు 1న థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే మృణాల్ తన ఇన్‌స్టా వేదికగా ఎమోషనల్ స్టోరీ షేర్ చేసింది. ‘ఎంతో అంకితభావంతో.. నెలల తరబడి నిద్రలేని రాత్రులు, లెక్కలేనన్ని క్షణాలు, ఇష్టం, పట్టుదలతో కృషి చేసిన తర్వాత.. మా ప్రేమ, శ్రమ చివరకు రేపు విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్‌లో మా హృదయాన్ని, ఆత్మను నింపాము. ప్రతి సన్నివేశం మన జీవితాలకు దగ్గరగా అనిపిస్తుంది. నేను చెప్పగలిగేది ఒక్కటే.. ఈ సినిమా నా హృదయానికి ఎంతో దగ్గరైంది. చాలా కాలం తర్వాత ఈ జానర్‌లో వస్తున్న అత్యంత అందమైన కథ ఇది. మా ఈ కుటుంభానికి ప్రేమను ఇవ్వండి’ అంటూ తెలిపింది.






