- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mrunal Thakur: టాలీవుడ్‌లో బంపర్ ఆఫర్ కొట్టేసిన మృణాల్.. ఏకంగా పాన్ ఇండియా స్టార్ సరసన చాన్స్!
యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) మొదట హిందీ సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) మొదట హిందీ సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత ఈ అమ్ము మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) సరసన చాన్స్ అందుకుంది. ‘సీతారామం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన నటన, అందంతో అందరి మనసులు గెలుచుకుంది. ఈ మూవీ థియేటర్స్‌లోకి వచ్చి ఘన విజయాన్ని సాధించడంతో మృణాల్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. ఆ తర్వాత ఈ భామ హాయ్ నాన్న, కల్కి వంటి సినిమాల్లో నటించి హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. అలాగే వెబ్‌స్టోరీస్‌లో కూడా చేసింది.
ఇక గత ఏడాది విజయ్ దేవరకొండ సరసన ‘ఫ్యామిలీ స్టార్’(Family Star) సినిమాలో నటించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. దీంతో ఆ తర్వాత కొద్ది కాలంపాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి వరుస ఫొటోలతో అభిమానులకు దగ్గరగా ఉంది. ప్రస్తుతం మృణాల్, అడివి శేష్ (Adivi Sesh)సరసన ‘డెకాయిట్’ చిత్రంలో నటిస్తుంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలై క్యూరియాసిటీని పెంచింది. దీంతో సినీ ప్రియులంతా ‘డెకాయిట్’ నుంచి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, మృణాల్ ఠాకూర్ ఓ బంపర్ అందుకున్నట్లు సమాచారం.
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ‘AA22’ వర్కింగ్ టైటిల్‌తో రాబోతుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతున్నట్లు టాక్. ఉగాదికి AA22 గ్లింప్స్ కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న వారంతా వావ్ సూపర్ ఐకాన్ స్టార్‌తో మూవీ తర్వాత మృణాల్ రేంజ్ మారిపోతుందని అంటున్నారు. ఇక దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.






