Mrunal Thakur:పెళ్లి కూతురిలా దర్శనమిచ్చి షాకిచ్చిన మృణాల్ ఠాకూర్.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

by Mallepaka Hamsa |

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

Mrunal Thakur:పెళ్లి కూతురిలా దర్శనమిచ్చి షాకిచ్చిన మృణాల్ ఠాకూర్.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత మృణాల్ ‘సీతారామం’(Sita Ramam) సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) హీరోగా నటించిన ఈ మూవీ ఘన విజయాన్ని సాధించడంతో మృణాల్ క్రేజ్ ఊహించని విధంగా పెరిగిపోయింది. దీంతో వరుస అవకాశాలు వచ్చాయి. ఇక ఆ తర్వాత మృణాల్ నటించిన ‘హాయ్ నాన్న’(Hi Nanna) మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమాకు అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి.

ఈ అమ్మడు ఓ వెబ్ సిరీస్‌లోనూ నటించింది. అది కూడా హిట్ కావడంతో గత ఏడాది పాన్ ఇండియా స్టార్ ‘కల్కి’లో కీలక పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది. అలాగే విజయ్ దేవరకొండ సరసన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీలో నటించింది. కానీ హిట్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ నటిస్తున్న తాజా చిత్రం ‘డెకాయిట్’. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయినప్పటికీ మృణాల్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వరుస పోస్టులు పెడుతోంది.

తాజాగా, పెళ్లి కూతురి గెటప్‌లో ఉన్న వీడియోను షేర్ చేసి అందరికీ షాకిచ్చింది. దీంతో ఈ పోస్ట్ నిమిషాల్లో వైరల్ అయిందనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ వీడియో చూసిన వారంతా సైలెంట్‌గా పెళ్లి చేసుకుంటుందా? అని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే మృణాలం నిజంగానే పెళ్లి చేసుకుంటుందా? లేదా ఏదైనా యాడ్ కోసమా అనేది తెలియాల్సి ఉంది. ఇక పెళ్లి కూతురిలా ఉన్న మృణాల్‌ను నెటిజన్లు వావ్, సూపర్, క్యూట్ అని పొగిడేస్తున్నారు.

Next Story