- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mrunal Thakur :వారితో అక్కడ ఎంజాయ్ చేస్తున్న సీతారామం బ్యూటీ.. ఫస్ట్ టైం అంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్
"సీతారామం"(Sita Ramam) సినిమాతో తెలుగు ఆడియెన్స్‌కు పరిచయం అయిన యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, సినిమా: "సీతారామం"(Sita Ramam) సినిమాతో తెలుగు ఆడియెన్స్‌కు పరిచయం అయిన యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. సంప్రదాయ లుక్‌లో కనిపించి మెప్పించేసరికి ఈ భామను అందరూ తెలుగమ్మాయి లానే తమ హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యిపోయారు. ఇలా మృణాల్ ఠాకూర్ తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొన్నేళ్లలోనే టాప్ హీరోయిన్ రేంజ్‌లో ఫేమ్ తెచ్చేసుకుంది. ఇక అక్కడ నుంచి కేవలం మూడు సినిమాల్లోనే కనిపిస్తే అందులో ఒకటి ప్లాప్ టాక్ తెచ్చుకుంది.
ఇలా తెలుగులో ఉన్న కొన్ని ఏళ్ళు ఫుల్ బిజీ అయ్యింది కానీ ది ఫ్యామిలీ స్టార్(Family Star) ప్లాప్ సినిమాతో నెమ్మదించింది. దీంతో మళ్ళీ బాలీవుడ్‌కి చెక్కేసింది. ఇక తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు అనే సమయంలో మరో సినిమా అనౌన్స్ చేసింది. ఇక ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ తెలుగులో యంగ్ హీరో అడివి శేష్ (Adivi Sesh)సరసన క్రేజీ థ్రిల్లర్ ‘డెకాయిట్’(Dacoit Movie) లో నటిస్తుంది.
ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో అదరహో అనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది మృణాల్. అందులో తన ఫ్రెండ్‌తో ఫస్ట్ టైం కాలికట్(Calicut) వెళ్లినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆమె స్నేహితురాలితో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ షేర్ చేస్తూ.. ‘ఫస్ట్ టైం కాలికట్‌కి వచ్చాను.. ఉఫ్ ఈ అనుభూతి మామూలుగా లేదు.. మళ్లీ ఇక్కడికి రావడం కోసం వేచి ఉండలేను’ అంటూ హార్ట్ సింబల్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు బాగా ఎంజాయ్ చేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






