24ఏళ్ల క్రికెటర్‌తో మృణాల్ ఠాకూర్ డేటింగ్.. హాట్ టాపిక్‌గా మారిన వీడియో!

by Mallepaka Hamsa |   (  Updated:2026-07-28 05:03:14  IST  )

ఓ 24 ఏళ్ల టీమిండియా యంగ్ క్రికెటర్‌తో మృణాల్ డేటింగ్‌లో ఉందంటూ సరికొత్త ప్రచారం మొదలైంది.

24ఏళ్ల క్రికెటర్‌తో మృణాల్ ఠాకూర్ డేటింగ్.. హాట్ టాపిక్‌గా మారిన వీడియో!
X

దిశ, సినిమా: స్టార్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ సినిమాలతో కంటే వ్యక్తిగత జీవితంతోనే నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. చేసింది తక్కువ చిత్రాలే అయినప్పటికీ, తన నటనతో క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ డేటింగ్ వార్తలు నెట్టింట ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. గతంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో మృణాల్ డేటింగ్‌లో ఉందంటూ పెద్ద ఎత్తున రూమర్లు వైరల్ అయ్యాయి. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో బ్రేకప్ చెప్పుకుని విడిపోయారనే వార్తలు కూడా వినిపించాయి. తాజాగా, ఓ 24 ఏళ్ల టీమిండియా యంగ్ క్రికెటర్‌తో మృణాల్ డేటింగ్‌లో ఉందంటూ సరికొత్త ప్రచారం మొదలైంది. ఆ యంగ్ క్రికెటర్ మరెవరో కాదు, టీమిండియా క్రేజీ ప్లేయర్ యశస్వి జైస్వాల్.

వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఈ రూమర్లకు ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో ఉన్న ‘బూజీ కేఫే’ కారణం. ఇటీవల ఒకే సమయంలో మృణాల్ కేఫే లోపల కనిపిస్తుండగా, సరిగ్గా అదే కేఫే నుంచి యశస్వి జైస్వాల్ బయటకు వచ్చి కారులో వెళ్లిపోతూ కెమెరాలకు చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు వీరు తమ రిలేషన్‌షిప్‌ను చాలా సీక్రెట్‌గా నడిపిస్తున్నారని కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇవి కేవలం ఫేక్ రూమర్లు మాత్రమేనని ఖండిస్తుండగా, మరికొందరు మాత్రం మృణాల్, జైస్వాల్ మధ్య దాదాపు 9 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉందంటూ సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు.

Next Story