- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిల్లీ ఇష్యూ.. ఒకరి ఒకరు కామెంట్స్ చేసుకుంటున్న హీరోయిన్స్.. నెటిజన్స్ రియాక్షన్ హైలైట్!
అందమైన మృణాల్ ఠాకూర్‌కు ప్రస్తుతం మంచి రోజులు లేనట్లున్నాయి. ఏ విషయం టచ్ చేసినా.. వివాదంగానే మారుతుంది. ఇన్ని రోజులు ధనుష్ ఇష్యూ.. ఇప్పుడు బిపాషా బసుపై కామెంట్స్. ఆమెను మగాళ్లతో పోల్చిన విషయం బాడీ షేమింగ్‌గా భావించబడింది.

దిశ, వెబ్ డెస్క్ : అందమైన మృణాల్ ఠాకూర్‌కు ప్రస్తుతం మంచి రోజులు లేనట్లున్నాయి. ఏ విషయం టచ్ చేసినా.. వివాదంగానే మారుతుంది. ఇన్ని రోజులు ధనుష్ ఇష్యూ.. ఇప్పుడు బిపాషా బసుపై కామెంట్స్. ఆమెను మగాళ్లతో పోల్చిన విషయం బాడీ షేమింగ్‌గా భావించబడింది. విమర్శలు ఎదుర్కొనేలా చేసింది. ‘కుంకుమ భాగ్య’ సీరియల్ టైమ్‌లోని వీడియో.. ఇప్పుడు ఆమెను దోషిగా నిలబెట్టింది. దీంతో ఈ సైలెన్స్‌ను బ్రేక్ చేస్తూ సోషల్ మీడియాలో స్టేట్మెంట్ ఇచ్చింది మృణాల్.
‘ పందొమ్మిది ఏళ్ల వయసులో చాలా సిల్లీ విషయాల గురించి మాట్లాడాను. వాటి వాల్యూ ఏంటో కూడా తెలియదు. ఎంతగా బాధిస్తాయో కూడా అర్థం కాదు. అంత మెచ్యూరిటీ లేదు. కానీ అది జరిగింది కాబట్టి హార్ట్‌ఫుల్‌గా సారీ చెప్తున్నా. బాధించడం, బాడీ షేమ్ చేయడం నా ఇంటెన్షన్ కాదు. కానీ ఫ్రెండ్స్‌తో చిట్ చాట్ హద్దులు దాటి అలా జరిగింది’ అని క్షమాపణలు కోరింది. ఇక ఈ స్టేట్మెంట్‌పై స్పందిస్తున్న మృణాల్ ఫ్యాన్స్.. ఇకనైనా నోరు మూసుకోవాలని సూచిస్తున్నారు.






