- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mrunal Thakur: ధనుష్‌తో మృణాల్ డేటింగ్.. ఫైనల్‌గా క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
క్లోజ్‌గా ఉంటే డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు సృష్టిస్తారా.. చాలా బాధగా అనిపిస్తుంది.

దిశ, సినిమా: సీతా రామం, హాయ్ నాన్న వంటి సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur).. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ‘సన్నాఫ్ సర్దార్-2’ (Son of Sardaar-2) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. అజయ్ దేవగన్ (Ajay Devgan) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం సూపర్ సక్సెస్ అందుకున్న ‘సన్నాఫ్ సర్దార్’రు సీక్వెల్‌గా తెరకెక్కగా.. ఆగస్టుల 1న థియేటర్స్‌లోకి వచ్చి విజయం అందుకుంది.
అయితే.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush).. ఆ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యాడు. ఈ క్రమంలోనే ధనుష్‌తో మృణాల్ కొంచెం క్లోజ్‌గా కనిపించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో.. వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే.. ఈ వార్తలపై ఇప్పటి వరకు ధనుష్, మృణాల్ స్పందించకపోవడంతో అవే నిజమంటూ ఫిక్స్ అయిపోయారు నెటిజన్లు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్.. డేటింగ్ వార్తలపై క్లారిటీ ఇచ్చింది.
రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ మాట్లాడుతూ.. ‘ధనుష్‌తో నేను డేటింగ్‌లో ఉన్నట్లు వస్తున్న వార్తలు నేను కూడా విన్నాను. వాటిని చూడగానే నాకు నవ్వు వచ్చింది. సన్నాఫ్ సర్దార్-2 ఈవెంట్‌కు ధనుష్ వచ్చినప్పటి నుంచి మా ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ వార్తలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. నిజానికి అజయ్ దేవగన్, ధనుష్ మంచి ఫ్రెండ్స్. దీంతో సినిమా ఈవెంట్‌కు అజయ్ పిలిస్తేనే ధనుష్ వచ్చారు. అయితే.. ఇద్దరం క్లోజ్ ఉన్నంత మాత్రాన మా మధ్య ఏదో ఉన్నట్లు, జరుగుతున్నట్లు వార్తలు రావడం నిజంగా బాధాకరం’ అని క్లారిటీ ఇచ్చింది మృణాల్. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ధనుష్‌తో రిలేషన్ ఉన్నట్లు వస్తున్న వార్తలకు చెక్ పడినట్లు అయింది.






