రామ్ పోతినేని చేతుల మీదుగా విడుదల కానున్న మృత్యుంజయ్ నెక్స్ట్ సాంగ్

by Pulgam srinivas |

శ్రీ విష్ణు హీరోగా రూపొందిన మృత్యుంజయ్ మూవీలోని హే జిందగీ సాంగ్ను రామ్ పోతినేని చేతుల మీదుగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది.

రామ్ పోతినేని చేతుల మీదుగా విడుదల కానున్న మృత్యుంజయ్ నెక్స్ట్ సాంగ్
X

దేశ, వెబ్ డెస్క్ : శ్రీ విష్ణు తాజాగా హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో రూపొందిన మృత్యుంజయ్ చిత్రంలో హీరోగా నటించాడు. ఈ చిత్రాన్ని మార్చి 6వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఈ మూవీ బృందం వారు ఈ చిత్రానికి సంబంధించిన పాటలను, ప్రచార చిత్రాలను ఒకదాని తర్వాత ఒకటి విడుదల చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఈ సినిమా నుండి హే జిందగీ అనే సాంగ్ను విడుదల చేయనున్నారు. ఈ సాంగ్ను టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని చేతుల మీదుగా సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.




మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. రెబా మోనికా జాన్ ఈ చిత్రంలో హీరోయిన్గా కనిపించబోతుంది. కాల భైరవ సంగీత సారథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మించారు. శ్రీ విష్ణు ఈ సినిమాతో పాటు విష్ణు విన్యాసంలో కూడా హీరోగా నటించాడు. దానిని ఫిబ్రవరి 27వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కేవలం వారం రోజుల గ్యాప్లో రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతున్న శ్రీ విష్ణు రెండు సినిమాలతో ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.

Next Story