- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mrityunjay : ట్రైలర్ విడుదల తేదీ వచ్చేసింది
Mrityunjay : ఈ సినిమా ట్రైలర్‌ను రేపు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్ : శ్రీ విష్ణు, రెబా మౌనికా జాన్ జంటగా మృత్యుంజయ్ అనే చిత్రం రూపొందింది. హుస్సేన్ షా కిరణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను మొదట ఫిబ్రవరి 27న విడుదల చేయాలన్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఈ మూవీని మార్చి 6వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ విడుదలకు సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను రేపు అనగా ఫిబ్రవరి 28వ తేదీన చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.
ఈ ట్రైలర్ కూడా జనాలను అలరిస్తే ఈ సినిమాపై అంచనాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నటుడు ఇప్పటివరకు తన కెరీర్లో చాలావరకు కామెడీ ఎంటర్టైనర్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మొట్టమొదటిసారి ఈయన తన రూట్ మార్చి సస్పెన్స్ థ్రిల్లర్ వైపు అడుగు వేశాడు. మరి ఈ జోనర్ సినిమాతో ఈ హీరో ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటాడో చూడాలి. ఇదిలా ఉంటే శ్రీ విష్ణు నటించిన విష్ణు విన్యాసం సినిమా ఈరోజే విడుదలైంది. ఆ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది.






