Mrithyunjay Producer: నెట్‌ఫ్లిక్స్ సహాయం లేకుంటే సినిమా ఈ స్థితిలో ఉండేది కాదు.

by Pulgam srinivas |

మృత్యుంజయ్ మూవీ నిర్మాత సందీప్ గుణ్ణం మాట్లాడుతూ... నెట్‌ఫ్లిక్స్ సంస్థ వారు ఈ సినిమా విషయంలో ఎంతో సహకారం అందించారు. అందుకే మా సినిమా ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా విడుదలైంది అని తెలిపారు.

Mrithyunjay Producer: నెట్‌ఫ్లిక్స్ సహాయం లేకుంటే సినిమా ఈ స్థితిలో ఉండేది కాదు.
X

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది కాలంగా ఓటీటీ సంస్థలు సినీ పరిశ్రమపై పెద్ద ఎత్తున పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తున్నాయని, వారు చెప్పిన తేదీనే సినిమాలు విడుదల కావాలనే షరతు మీదే సినిమా హక్కులను కొనుగోలు చేస్తున్నారని పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఓ సినిమా నిర్మాత మాత్రం ఓటీటీ సంస్థ కారణంగానే ప్రస్తుతం మా సినిమా ఇంత హాయిగా విడుదల అయిందని, వారు లేకపోయి ఉండుంటే పరిస్థితి చాలా ఘోరంగా ఉండేదని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంతకు ఆ సినిమా ఏది? ఆ నిర్మాత ఎవరు అనేది తెలుసుకుందాం.

శ్రీ విష్ణు తాజాగా మృత్యుంజయ్ అనే చిత్రంలో హీరోగా నటించాడు. రెబా మోనికా జాన్ ఇందులో హీరోయిన్గా నటించగా, హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించాడు. సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదట ఈ సినిమాను ఫిబ్రవరి 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 28న శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన విష్ణు విన్యాసం కూడా విడుదల కానుండడంతో ఈ సినిమా విడుదల వాయిదా వేసి మార్చి 6న విడుదల చేశారు. ఈ మూవీకి మంచి టాక్ రావడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఓ ఈవెంట్ను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన సందీప్ గుణ్ణం మాట్లాడుతూ... "మేము ఫిబ్రవరి 27న ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నాం.

అందుకు అనుగుణంగా నెట్‌ఫ్లిక్స్ సంస్థతో ఒప్పందం కూడా కుదిరింది. దాదాపు అదే తేదీన శ్రీ విష్ణు నటించిన మరో సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ నిర్మాతలు వెనక్కు తగ్గే పరిస్థితుల్లో లేరు. దానితో నెట్‌ఫ్లిక్స్ సంస్థ వారు స్వయంగా వచ్చి మీ బాధను మేము అర్థం చేసుకున్నాము, విడుదలను వారం వాయిదా వేయండి. మేము ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని కూడా వారం వెనక్కు పెంచుతాం" అని చెప్పారు. వారు అంత మద్దతు ఇచ్చి ఉండకపోతే ఈ సినిమా ఇలా అనుకున్న తేదీలో విడుదల అయ్యేది కాదు అని ఈ మూవీ నిర్మాత తాజాగా చెప్పుకొచ్చాడు.

Next Story