- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
mrunalthakur: లైఫ్ అప్డేట్ అంటూ మృణాల్ ఠాకూర్ పోస్ట్
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ కేవలం తెలుగులోనే కాకుండా.. మరాఠీ, హిందీ భాషల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటూ ప్రేక్షకుల గుండెల్లో చోటు దక్కించుకుంటుంది. తెలుగులో సీతారామం సినిమాతో ఎంట్రీ.. తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. తర్వాత హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్, కల్కి 2898 వంటి చిత్రాల్లో అద్భుతంగా నటించి జనాల్ని ఆకట్టుకుంది.
అందం, అభినయం, నటనలో మృణాల్‌కు మంచి పేరు సంపాదించుకుంది. వీటితో పాటుగా ఈ భామ జెర్సీ, టూఫాన్, లస్ట్ స్టోరీస్ 2, బాట్లా హౌస్, గుమ్రాహ్, ఆంక్ మిచోలీ, నందర్ గారు నమస్కారం, సురాజ్య వంటి హిందీ, మరాఠీ సినిమాల్లో నటించి అద్భుతమైన నటనతో నెటిజన్లను మెప్పించింది. అలాగే బాలీవుడ్‌లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.
తూహీహీ అనే సినిమాలో నటించి అటు బాలీవుడ్ ప్రేక్షకుల మెప్పు పొందింది. రవి ఉద్యవార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిద్ధార్థ్ చతుర్వేది ముఖ్యపాత్రలో నటించారు. ఈ మూవీ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుది. ఇకపోతే మృణాల్ అటు సినిమాల్లో నటిస్తూనే ఇటు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పలు ఫొటోలు పంచుకుని ‘లైఫ్ అప్డేట్’ అంటూ ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.






