- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాకు నయనతారను కలవాలని ఉంది.. సీఎం నా కోరిక తీరుస్తారా?: నిండుసభలో MP అసభ్యకర వ్యాఖ్యలు
మహిళల భద్రత మరియు గౌరవం కోసం అన్నాడీఎంకే (AIADMK) నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఆ పార్టీకి చెందిన ఒక ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: మహిళల భద్రత మరియు గౌరవం కోసం అన్నాడీఎంకే (AIADMK) నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఆ పార్టీకి చెందిన ఒక ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ప్రముఖ నటి నయనతారను ఉద్దేశించి ఆయన చేసిన లైంగిక వేధింపుల తరహా, అవమానకర వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇటీవల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. తమ కలలను పంచుకోవాలని, వాటిని నెరవేర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని పిలుపునిచ్చారు. దీనిపై విమర్శలు చేసే క్రమంలో సదరు ఎంపీ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మాటలను ప్రస్తావిస్తూ అసభ్యకరమైన పోలికను తెచ్చారు.
"అబ్దుల్ కలాం గారు మనల్ని కలలు కనమన్నారు. స్టాలిన్ కూడా తనతో కలలను పంచుకోమంటున్నారు. ఒకవేళ నాకు నయనతార కావాలని కల వస్తే, స్టాలిన్ నా కోరిక తీరుస్తారా? ఎవరైనా వెళ్లి తమకు నయనతారతో పెళ్లి చేయమని అడిగితే, ఆయన ఆ కల నెరవేరుస్తారా?" అని సదరు నేత వ్యాఖ్యానించారు. మహిళల రక్షణ కోసం చేపట్టిన నిరసనలోనే ఒక మహిళా నటిని ఇంత దారుణంగా కించపరచడంపై సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అంతేకాదు.. ఎంపీ ఆ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు పక్కనే ఉన్న ఇతర పార్టీ నేతలు వారించాల్సింది పోయి, నవ్వుతూ మద్దతు తెలపడంపై విమర్శకులు మండిపడుతున్నారు.






