- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోగ్లీ సినిమాపై సాయి దుర్గా తేజ్ కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్
యంగ్ హీరో రోషన్ కనకాల లేటెస్ట్ వైల్డ్ బ్లాక్ బస్టర్ 'మోగ్లీ 2025'. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్,

దిశ, సినిమా : యంగ్ హీరో రోషన్ కనకాల లేటెస్ట్ వైల్డ్ బ్లాక్ బస్టర్ 'మోగ్లీ 2025'. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. డిసెంబర్ 13న వరల్డ్ వైడ్ విడుదలై వైల్డ్ బ్లాక్ బస్టర్ గా అలరిస్తూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్ యూ మీట్ నిర్వహించారు. సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
థాంక్ యూ మీట్ లో హీరో సాయి దుర్గ తేజ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మోగ్లీ లాంటి మంచి సినిమాని సపోర్ట్ చేసినందుకు థాంక్యూ. మోగ్లీ నాకు చాలా ఫేవరెట్. చిన్నప్పుడు నుంచిఆ క్యారెక్టర్ చూస్తూ పెరిగా. ఈరోజు ఆ టైటిల్ తో సినిమా రావడం అనేది చాలా ఆనందాన్ని ఇచ్చింది. రోషన్ అద్భుతంగా నటించాడు. అలాగే బండి సరోజ్ గారు కూడా చాలా బాగా చేశారు. మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే ఈ సినిమా ఎంత సక్సెస్ అయింది. హర్ష బంటి క్యారెక్టర్ లో అద్భుతంగా ఇమిడిపోయారు. ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ మాత్రమే మాట్లాడుతుంది. సందీప్ గారు సినిమాని చాలా అద్భుతంగా తీశారు. ఇంత మంచి సినిమాని సపోర్ట్ చేసిన నిర్మాత విశ్వప్రసాద్ గారికి అభినందనలు. ఆయన చివరి నిమిషంలో సినిమాని ఒక రోజు వెనక్కి కూడా తీసుకెళ్లారు. అది మామూలు విషయం కాదు. విశ్వ గారికి హాట్సాఫ్. సినిమా రిలీజ్ అయింది. చాలా బాగా ఆడుతుంది మంచి సినిమాని సపోర్ట్ చేసినందుకు అందరికీ థాంక్యూ. మీ అందరి బ్లెస్సింగ్స్ ఇలానే ఉండాలి. రాజీవ్ నాకు అన్నయ్య. సుమ వదినగారు. సుమ గారు అన్ని సినిమాలు తనవిగా భావించి సపోర్ట్ చేస్తారు. మా వదిన గారి అబ్బాయికి మంచి సినిమా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. రోషన్ మరింత గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ కి థాంక్యూ.
హీరో రోషన్ కనకాల మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నాకు సినిమా అంటే ప్రాణం పిచ్చి. మీరందరూ కూడా ఈ సినిమాని ఆదరించారు. సపోర్ట్ చేశారు. ప్రతి ప్రేక్షక దేవుడికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన సాయి తేజ్ అన్నకి థాంక్యూ. ఆయన రావడం మాకు ఎంతో ఉత్సాహాన్ని ఆనందాన్ని ఇచ్చింది. సాక్షి అద్భుతంగా నటించింది. తన క్యారెక్టర్ కోసం రీసెర్చ్ చేసింది. తను సినిమాని బలంగా నమ్మింది. ప్రమోషన్స్ కి ఎంతో ఉత్సాహంగా ప్రమోట్ చేసింది. విశ్వప్రసాద్ గారు లేకుండా ఈ సినిమా ఉండేది కాదు. ఆయన వల్లే ఈ విజయం మా అందరికీ దక్కింది. ఆయన వల్లే మేము ఈ మ్యాజిక్ చేయగలిగాం. ఇందులో బంటి క్యారెక్టర్ చేసిన హర్షకి థాంక్యూ. సుమా రాజీవ్ కొడుకు కదా తనకంత ఈజీగా జరిగిపోతుంది అనే మాటలు నేను విన్నాను. ఏదైనా ఈవెంట్ కి ఒక గెస్ట్ ని తీసుకురావడం వరకూ ఓకే. నిజానికి అందరు హీరోలు, వారి అభిమానులు నాకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. అయితే దీనికి మించి తలరాత వుంటుంది. ఒకరి తలరాత వాళ్ల చేతిలోనే ఉంటుంది. దానిని నిర్వచించేది హార్డ్ వర్క్, టాలెంట్. డిస్ప్లేన్. ఈ మూడు మాత్రమే విజయాన్ని నిర్ణయిస్తాయి. నా హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ నేను పెట్టాను. ప్రాణం పెట్టి పని చేశాను. అందరూ చాలా ప్రేమతో ఈ సినిమాని చేశారు. తప్పకుండా మీరందరూ థియేటర్స్ కి వచ్చే సినిమా చూస్తే ఎంజాయ్ చేస్తారు. సినిమా చూసిన వాళ్ళందరికీ థాంక్యూ. ఇంకా చూడని వాళ్ళు వారు థియేటర్స్ కి రావాలని కోరుతున్నాను. టికెట్స్ రేట్ కూడా తక్కువగా ఉన్నాయి. ఈ మొగ్లీని గెలిపించిన అందరికీ నమస్కరిస్తున్నాను. అమ్మ ఏదైనా ఈవెంట్ చేస్తే బాగుంటుందని అనుకున్నాను. అయితే తను ఎప్పుడు కూడా నీకు కష్టాన్ని నమ్ము అని చెప్పేది. తను చెప్పిన మాటలు నాకు అర్థం అయ్యాయి. నా హార్డ్ వర్క్ నమ్మాను. అమ్మ నాన్న నా ఈవెంట్లకు రాలేదు. వచ్చుంటే వాళ్ళిద్దరి కాళ్ళకి నమస్కారం చేసేవాడిని. వాళ్ళు లేకపోతే నేను లేను. అందరికీ థాంక్యూ సో మచ్.






