Mowgli: ఫుల్ షూటింగ్ స్వింగ్‌లో మూవీ.. గుర్రంపై స్వారీ చేస్తున్న హీరో

by Chukka Sudharani |

యంగ్ హీరో రోషన్ కనకాల (Roshan Kanakala) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మోగ్లీ’ (Mowgli).

Mowgli: ఫుల్ షూటింగ్ స్వింగ్‌లో మూవీ.. గుర్రంపై స్వారీ చేస్తున్న హీరో
X

దిశ, సినిమా: యంగ్ హీరో రోషన్ కనకాల (Roshan Kanakala) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మోగ్లీ’ (Mowgli). ‘కలర్ ఫొటో’ ఫేమ్ డైరెక్టర్ సందీప్ రాజ్ (Sandeep Raj) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించనున్నాడు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన ఫస్ల్ లుక్, టైటిల్ పోస్టర్ మూవీపై హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేశాయి. అంతేకాకుండా.. మోగ్లీ మూవీ కోసం రోషన్ తన లుక్ మొత్తం చేంజ్ చేసుకొని ఎంతో కష్టపడుతున్నాడు. ఇక ఈ హీరో కండలు తిరిగిన బాడీని చూస్తేనే ఏ రేంజ్‌లో మేకోవర్ అయ్యాడో చెప్పొచ్చు. ఇదిలా ఉంటే.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లేటెస్ట్‌గా ‘మోగ్లీ’ నుంచి అప్‌డేట్ ఇచ్చింది. ‘మోగ్లీ యొక్క అతిపెద్ద యాక్షన్ షెడ్యూల్ సిద్ధం అవుతోంది. షూటింగ్ పూర్తి స్వింగ్‌లో ఉంది. త్వరలో ఉత్తేజకరమైన అప్‌డేట్‌లు మీ ముందుకు వస్తున్నాయి’ అంటూ ఓ వీడియో షేర్ చేశారు. ఇందులో హీరో గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు చూపించారు.

Next Story